Devotional : విభిన్న మతాలతో , విభిన్న ఆచారాలతో, విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికి అందరూ ఒక్కటికే జీవించే దేశం భారతదేశం. మన దేశంలో పలు మతాల వారు నివసిస్తున్నప్పటికి హిందూ సాంప్రదాయాలకు మాత్రం పెట్టింది పేరుగా పరిగణిస్తారు. అయితే దేశంలో వారి వారి ఆచారాలకు తగ్గట్లుగా చర్చిలు, మసీదులు, దేవాలయాలు అనేకం ఉన్నాయి. మన దేశంలో ఇక హిందువులకు చెందిన దేవాలయాల సంఖ్య లెక్కించడం చాలా కష్టం అనే చెప్పాలి. కానీ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద హిందు దేవాలయం మాత్రం మన దేశం లేదు. ఇంతకీ అంతపెద్ద దేవాలయం ఎక్కడుంది ఏఎన్‌ఐ ఆలోచిస్తున్నారా… ఆ వివరాలు మీకోసం…
కాంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే పెద్ద హిందు దేవాలయంగా చరిత్రకెక్కింది. శ్రీ మహావిష్ణువు కొలువైయున్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో సూర్యవర్మస్ అనే రాజు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా క్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కాని శిల్పాకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది. 200 చ .కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందని సమాచారం.
ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటి అంటే… ఎక్కడైనా కానీ నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట. ఇలా ఎందుకు జరుగుతోందని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోవడం విశేషం. కంబోడియా దేశ జాతీయ పతాకం లోనూ ఈ దేవాలయానికి స్థానం దక్కింది. అలానే హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంగ్‌కోర్ వాట్ దేవాలయాన్నినిర్మించారు. మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి. అంగ్ కోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల ఎత్తయిన భారీ గోపురంతోపాటు దానికి నాలుగు పక్కలా కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి. దేవాలయం చుట్టూ 650 అడుగుల వెడల్పుతో 13 అడుగుల లోతుతో నీటి కందకం ఉంటుంది. ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు.