Devotional : హిందూ ఆచారాల ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. కాబట్టి గురువారం శ్రీమహావిష్ణువును పూజించటం అనవాయితీ. గురువారం నాడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిలతో పాటు నారాయణుడిని పూజించాలి.
అదేవిధంగా గురువారం రోజు దేవగురు బృహస్పతికి కూడా ఎంతో ముఖ్యమైనది. ఏ వ్యక్తి యెుక్క జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నాడో.. అతడు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అంతేకాకుండా అతడి కెరీర్ లో పురోగతి ఉండదు. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అందుకే గురువారం కొన్ని పరిహారాలు చేయడం ద్వారా జాతకంలో బృహస్పతి యెుక్క అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు.
గురువారం శ్రీవిష్ణు, లక్ష్మీదేవి లకి ఎంతో ప్రీతికరమైన రోజు. కనుక ఎవరికైతే గురు స్థానం బలహీనంగా ఉంటే వారు గురువారం నాడు లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో పసుపు బట్టలు ధరించి నారాయణునికి బెల్లం, శనగలను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
పసుపు పుష్పాలు, పసుపు బట్టలు, పసుపు, చందనం సమర్పించండి. వీలైతే ఉపవాసం ఉండి సాయంత్రం పూట మిఠాయిలు తిని ఉపవాసాన్ని విరమించండి. ఉపవాసం చేయలేనివారు గురువారం రోజున ఉపవాస కథను చదవాలి లేకపోతే వినాలి. అరటి చెట్టుకు పూజ చేసి నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల గురుస్థానం బలపడుతుందని వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు గురుగ్రహానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.
గురువారం ఈ పనులు చేయండి :
గురువారం సూర్యోదయానికి ముందే లేవండి.
గురువారం రోజున ముందుగా నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజలో కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల మీరు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు.
అరటి చెట్టు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది.
అందుకే అరటి చెట్టు దగ్గర కూర్చుని పూజించండి. అలాగే అరటిచెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల మేలు జరుగుతుంది. విష్ణువుకు పసుపు రంగు చాలా ఇష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందుచేత స్నానం చేసి పూజలో కూర్చున్నప్పుడు పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. దేవుడికి పసుపు పువ్వులు సమర్పించండి.
గురువారం రోజున ‘ఓం బృహస్పత్యే నమః’ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి.
శనగ పిండితో చేసిన ఏదైనా స్వీట్‌ను నైవేద్యంగా పెట్టండి. అలాగే గురువారంనాడు పసుపు, పిండి, బంగారం మొదలైనవి దానం చేయండి. అలాగే, ప్రతి గురువారం ఆవుకు పిండిలో బెల్లం, శనగలను కలిపి తినిపించండి. గురువారం రోజు జుట్టు కత్తిరించవద్దు. గోర్లు కత్తిరించవద్దు
పూజ చేసే విధానం :
స్నానం తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామాన్ని పఠించండి.
గురువారం పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు :
గురువారం రోజున పూజించడం వల్ల వ్యక్తి యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజించిన వారి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఈ రోజున పూజలు చేయడం వల్ల కెరీర్ లో పురోగతి ఉంటుంది.
వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవాలంటే ఈ రోజున పూజ చేయాలి