Kv Anudeep : జాతిరత్నాలు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు కేవీ అనుదీప్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ముఖ్యంగా కేవలం సినిమాల తోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొని తన మేనరిజంతో ఫుల్ ట్రెండ్ అయ్యాడని చెప్పాలి. కాగా అంతకు ముందు నాగ్ అశ్విన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కోవిడ్ సమయంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులతో నవ్వులు పూయించింది.
ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనుదీప్. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో ఉక్రెయిన్ హీరోయిన్ మరియా హీరోయిన్ గా చేసింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ తరుణంలోనే అనుదీప్ తన నెక్ట్స్ సినిమాని ఓ క్రేజీ హీరోతో చేయనున్నాడని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
అనుదీప్… రామ్ పోతినేనితో కోసం ఒక స్టోరీ సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం రామ్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే వారియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బోయపాటి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు రామ్. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి అఫిషియల్ అప్డేట్ వచ్చే వరకు…