Deepa Jagadeesh: ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్ మల్లీ. ఇక ఈ సీరియల్ ప్రారంభమైన కొంత సమయానికే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది.
ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మాలిని కూడా అందరినీ తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈమె అందరికీ సుపరిచితురాలే. ఈటీవీలో ప్రసారమైన ప్రేమనగర్ సీరియల్ తో తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే బుల్లితెరలో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
తన నటనతో, అందంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే ఇప్పుడు మాలిని రియల్ లైఫ్ గురించి ఈ ఆర్టికల్ లో ఇప్పుడు తెలుసుకుందాం. ఈమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుందాం.. మాలిని అసలు పేరు దీపా జగదీష్.
ఈమె డిసెంబర్ 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని దర్బార్లో జన్మించింది. ఈమె కన్నడకు సంబంధించిన నటి. ఈమె తన చదువు అంతా కర్ణాటకలోనే పూర్తి చేసింది. కర్ణాటకలోని స్టేట్ యూనివర్సిటీలో ఆమె తన ‘ లా ‘ పూర్తి చేసింది. అయితే ఈమె ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తుంది.
ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. దీపకీ ఒక అన్నయ్య ఉన్నాడు. ఇక చిన్నతనం నుంచే దీపకు నటనలో ఆసక్తి ఉండడంతో యాక్టింగ్ పై పట్టు సాధించి తన కెరీర్లో హీరోయిన్ గా మారాలని నిర్ణయించుకుంది. దీంతో మహాసతి అనే కన్నడ సీరియల్ తో దీప హీరోయిన్గా కన్నడ బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత వారస్దార, బ్రహ్మాస్త్రం, కావ్యాంజలి వంటి కన్నడ సీరియల్స్ లో నటించి కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అలాగే చాలామంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈమె కన్నడ సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లో కూడా నటించింది.
క్రిటికల్ కీర్తనగరు అనే కన్నడ సినిమాలో ఈమె నటించింది. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే ప్రేమనగర్ అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమై తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సీరియల్లో ముఖేష్ గౌడ్ కి జోడిగా నటించి మెప్పించింది. అలాగే ఈటీవీలో ప్రసారం అవుతున్న గౌరమ్మ సీరియల్ లో కూడా దీపా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న మళ్లీ సీరియల్ లో మాలినిగా నటిస్తోంది.