Rashmika Mandanna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి “ ఛలో ” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ భామ. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో క్యూటెస్ట్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అందుకే కావచ్చు రష్మిక కి నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ కన్నడ ఇండస్ట్రీలలో కూడా రష్మీక సత్తా చాటుతోంది. కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ వైపు సినిమాలు, మరోవైపు టాక్ సొ తో దుమ్ములేపుతున్నారని చెప్పాలి.
ఆహా ఓటిటీ వేదికగా ప్రసారం అవుతున్న ” అన్స్టాపబుల్ టాక్ షో ” తెలుగు ప్రేక్షకులకు బాలయ్యలోని మరో కోణాన్ని పరిచయం చేసిందని చెప్పాలి. అన్స్టాపబుల్ షో మొదటి సీజన్ ప్రేక్షకులను ఫుల్ గా అలరించగా… ఇటీవల ప్రారంభమయిన అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ మరింత సక్సెస్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సీజన్లో వచ్చిన రెండు ఎపిసోడ్లు బాగా సక్సెస్ కాగా… ఇప్పుడు నవంబర్ 4వ తేదీ నుంచి ఎపిసోడ్3 టెలికాస్ట్ అవుతోంది. ఈ మేరకు ఆహా టీమ్ ఈ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో లో అన్స్టాపబుల్ 2 మూడో ఎపిసోడ్లో భాగంగా కుర్ర హీరోలు అడివి శేష్, శర్వానంద్ అతిథిలుగా హాజరవుతున్నారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇద్దరు కుర్ర హీరోలతో బాలయ్య బాబు చేసిన సందడి మామూలుగా లేదని చెప్పాలి.
గత ఎపిసోడ్లో బాలకృష్ణ… రష్మిక మందన్నపై తనకి క్రష్ ఉందంటూ మనసులో మాటని బయట పెట్టారు. ఈ మేరకు ఈ న్యూ ఎపిసోడ్ లో శర్వానంద్ బాలయ్యతో రష్మికను వీడియో కాల్లో మాట్లాడించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.