Srireddy : శ్రీరెడ్డి… ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. నటిగా కంటే కూడా కాంట్రవర్సీల తోనే ఈమె ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది అనడంలో సందేహం లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ భామ. క్యాస్టింగ్ కౌచ్, రాజకీయాలు ఇలా టాపిక్ ఏదైనా తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా వ్యక్తం చేస్తుంది శ్రీ రెడ్డి.
గతంలో తెలుగు సినీ పరిశ్రమలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరిని టార్గెట్ చేసి తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు శ్రీరెడ్డి. ఇక ఇప్పుడు ప్రస్తుతం శ్రీరెడ్డి రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనబడుతుంది. తనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే ఇష్టం అని భాహాటంగానే వ్యక్తపరిచింది. ఈ మేరకు సీఎం జగన్ ని ఎవరైనా విమర్శించినా… అలానే ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా తనదైన శైలిలో పరుష పద జాలంతో చీల్చి చెండాడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడూ పలు అంశాలపై స్పందించి వార్తల్లో ఉండే శ్రీరెడ్డి తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టులు, చాట్, లైవ్ ఇలా అన్నిటిలో ద్వారా యాక్టివ్ గా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. తన అందాలు ఆరబోస్తూ అభిమానులకు కను విందు చేస్తుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త యాక్టివిటీ తగ్గించిన శ్రీరెడ్డి… మళ్ళీ యూట్యూబ్‌లో కమ్ బ్యాక్ ఇచ్చి దుమ్ము రేపుతుంది. శ్రీరెడ్డి సొంతంగా వంటకాలు చేయడమే కాదు అప్పుడప్పుడు రెస్టారెంట్స్‌కి కూడా వెళ్లి వెరైటీ వంటకాలు రుచి చూస్తూ వాటి గురించి రివ్యూ చేస్తూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.
ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో గన్ ఫైరింగ్ చేస్తూ ఉండడం విశేషం. చీర కట్టులో గన్ పట్టుకొని టార్గెట్ ను షూట్ చేస్తూ అదరగొడుతుందనే చెప్పాలి. ఈ వీడియో పట్ల ఆమె అభిమానులు స్పందిస్తూ పలువురు సూపర్ అంటూ కామెంట్లు చేస్తుండగా… పలువురు మాత్రం ఈసారి ఎవరికి గురి పెట్టిందో అంటూ ట్రోల్ కామెంట్ చేస్తున్నారు.