Thugs: ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం థగ్స్. ఈ సినిమా హిందీతో పాటు భాషల్లో కూడా విడుదల కానుంది. కాగా ఈ సినిమాను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై రియా షిబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే రియా షిబు మరెవరో కాదు.. ఆర్ఆర్ఆర్, విక్రమ్, డాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శిబు తమీన్స్ కుమార్తెనే. థగ్స్ సినిమా రా యాక్షన్ ఫిలిం గా రూపొందుతోంది.
.ఈ సినిమాలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో హీరో హ్రిదు హరూన్ వెండితెర కు పరిచయం కానున్నాడు. హ్రిదు హరూన్, థగ్స్ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. కాగా హ్రిదు హరూన్ ఇప్పటికే అమెజాన్ లో వచ్చిన క్రాష్ కోర్స్ సీరీస్ లో నటనతో పలు విమర్శలు కూడా అందుకున్నాడు. అంతే కాకుండా హ్రిదు హరూన్ త్వరలో విడుదల కానున్న హిందీ చిత్రం మంబైకర్ లో కూడా నటించారు.
కాగా ఈ థగ్స్ సినిమా మ్యూజిక్, ప్రోమో కంటెంట్ ను తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడం కోసం సోనీ మ్యూజిక్ తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కాగా ఇటీవల విడుదల అయిన
థగ్స్ సినిమా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో చిత్రం పై అంచనాలను మరింత పెంచేసింది. అలాగే శామ్ సి ఎస్ సంగీతం, బీజిఎం అందిస్తున్నారు. టాప్ ఎడిటర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు ఊహిస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
థగ్స్ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో 2022 డిసెంబర్ లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
నటీనటులు:
హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని తదితరులు కనిపించనున్నారు.
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం బృంద
నిర్మాణం హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
సంగీతం – శామ్ సి ఎస్
డీ వో పి – ప్రీయేష్ గురుస్వామి
ప్రాజెక్ట్ డిజైనర్ – జోసెఫ్ నెళ్లికల్
ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ
యాక్షన్ – ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ముత్తు కురుప్పయ్య
కాస్ట్యూమ్స్ – మాలిని కార్తికేయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యువరాజ్
కో డైరెక్టర్ – హరిహరకృష్ణన్ రామలింగం
డిజైనర్ – కబిలన్
పి ఆర్ ఓ – బి ఏ రాజు’స్ టీం (తెలుగు)