విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్నాడు. మొదట్లో ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కొడుకుగా సినీ రంగంలోకి వచ్చినా కూడా తన సొంత టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే వెంకటేష్ భార్య, పిల్లలు గురించి ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పాలి. ఎప్పుడు కూడా వెంకటేష్ భార్య గురించి గాని, పిల్లల గురించి గాని ప్రస్తావించిన సందర్భాలు లేవు. ఇక ఈ మధ్యనే వారి కుటుంబంలో రానా, మిహికా బజాజ్ వివాహం జరిగిందన్న విషయం అందరికి తెలుసు. అయితే ఆ అమ్మాయిని ఇంటర్ క్యాష్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు.
కానీ వెంకటేష్ నీరజా రెడ్డిని ఎప్పుడో రెండున్నర దశాబ్దాల క్రితమే కులాంతర వివాహాం చేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు. అంటే వెంకటేష్ ఒక రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వెంకటేష్, నీరజ రెడ్డి వివాహం 1985 లో జరిగింది. వెంకటేష్ కు 25 ఏళ్ల వయస్సులో .. ఇద్దరు కుటుంబ పెద్దలు వెంకటేష్, నీరజా రెడ్డిల పెళ్లిని ఘనంగా జరిపించారు.
వీరి జంటకు మొత్తం నలుగురు పిల్లలు. ముగ్గురు అమ్మాయిలు, ఒక బాబు. నీరజా రెడ్డి ఎప్పుడు కూడా నేను ఒక పెద్ద స్టార్ హీరో భార్యను అని గొప్పలకు పోయి లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసేది కాదు. చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ ఉంటోంది. ఎప్పుడు వెంకటేష్ షూటింగ్ లని, సినిమాలని బిజీగా ఉంటారు.
దీంతో కుటుంబ బాధ్యతలను, పిల్లల బాధ్యతలను తనపై వేసుకొని కుటుంబాన్ని ఒక సరైన పద్దతిలో చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ. ఇప్పటికీ ఇంట్లో ఉన్న తన నలుగురు పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటుంది. అంతేకాదు వారి చదువులో ఆమె పాత్రనే కీలకం అంట. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. అలానే వెంకటేష్ ఇంటికి మాత్రం నీరజారెడ్డి పాత్రనే కీలకం అనే చెప్పాలి.
ఎంత పెద్దింటి కోడలైనా డాబు, దర్పం అనేవి ప్రదర్శించకుండా ఒక సామాన్యురాలిగానే కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోంది నీరజా రెడ్డి. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సినిమా షూటింగ్లలో బిజీగా గడుపుతున్నారు. ప్రేక్షకులు ఈ విషయంపై వెంకటేష్ గారు సమాజానికి ఆదర్శం అని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు