ఎర్ర చీమల చట్నీ ఏంటి అని ఆలోచిస్తున్నారా. ఇది మనకు తెలిసిన చీమలతో తయారుచేసిన చట్నీ అనుకుంటే అది పొరపాటే. ఈ చట్నీ కేవలం ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ లో దొరికే ఎర్ర చీమల ద్వారా తయారుచేసే ఈ చట్నీ ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందింది.
ఇక బస్తర్ గిరిజనులకు ఎర్ర చీమల చట్నీ రోజువారి ఆహారంలో ఒక భాగం. ఇక రుచి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో ఈ చట్నీకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ చట్నీ దొరకడం అంతా సులువేం కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది.
ప్రపంచ ప్రసిద్ది చెందిన రెడ్ యాంట్ చట్నీ, బస్తారియా ఫుడ్‌కు రాజేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. బస్తర్ గిరిజనులలో ఒకడైన రాజేష్ బస్తారియా వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. వ్యాపార పరంగా లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు. దీనికోసం దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు.
బస్తారియా సాంప్రదాయ వంటకాల ప్రదర్శనలు ఎక్కడ జరిగిన స్టాళ్లు ఏర్పాటు చేస్తే.. ప్రజలు ఈ బస్తారియా ఆహారాన్ని బాగా ఇష్టపడుతున్నారు. బాగా డిమాండ్ పెరగడంతో తగిన రీతిలో సప్లై చేయడం కూడా కష్టంగా మారింది. అందుకే ఈ బస్తారియా ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు డాబాలు ఏర్పాటు చేశాడు.
ఒక్కో డాబా లో నెలకు సగటున 2 నుంచి 2.5 లక్షల టర్నవర్ ఉండడంతో.. క్రమేనా డాబాలను కూడా పెంచుతూ మంచి లాభాలు గడిస్తున్నాడు. ఆమ్చో బస్తర్ డాబాలో ప్రపంచ ప్రఖ్యాత రెడ్ యాంట్ చట్నీ (చంపడా), వెదురు చికెన్, సుక్సీ, బెండ ఝోర్, గుడ్డు పుడ్‌గా, తికూర్ కి స్వీట్లు, మహువా లడ్డూ, మడియా పెర్చ్, లండా (బియ్యంతో తయారు చేసిన వైన్) మొదలైనవి లభిస్తాయని రాజేష్ వివరించాడు.
కేంద్ర మంత్రులు రేణుకా సింగ్, అర్జున్ మాండా తదితరులు ఒక ఎగ్జిబిషన్లో రాజేష్ తయారు చేసిన మహువా లిక్కర్, రెడ్ యాంట్ చట్నీని రుచి చూసి, ఎంతగానో మెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా బస్తారియా వంటకాలకు భారీగా డిమాండ్ పెరగడం జరిగింది.