Health Tips : చౌకగా దొరికే పండ్ల లో జామ ఒకటి. జామ పండులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. జామ సంవత్సర కాలం దొరుకుతుంది. ఇక జామ పండును ముక్కలుగా చేసి తినవచ్చు.జ్యూస్ గా తీసుకోవచ్చు. ఎక్కువగా జ్యూస్ గా తీసుకొనుట వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాలేయ సమస్యలను మెరుగు పరుస్తుంది.
ఇక జామపండును ప్రతిరోజు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచి మలబద్దక సమస్యలను తగ్గిస్తుంది. జామపండులో సి-విటమిన్ విలువలు నారింజ పండులో కంటే ఎక్కువగా ఉంటాయి.
అరటిలో ఎంత పొటాషియం ఉంటుందో… జామలోనూ అంతే ఉంటుంది. జామపండ్లలో యాంటీఆక్సిడెంట్స్, కెరోటిన్, పొటాషియం ఉంటాయి. ఇక నీరు 80 శాతం ఉంది. ఫలితంగా జామ తింటే… దాహం తిరుతుంది.
ఒక జామకాయ తింటే 112 కేలరీలు వస్తాయి. 23 గ్రాముల కార్బొహైడ్రేట్స్ (పిండిపదార్థం), ఫైబర్ లభిస్తాయి. అలాంటి పండును తింటే కొన్ని సమస్యలు గ్యారంటీ అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇంతకూ అవేంటంటే..
వాపుతో బాధపడేవారు: జామలో విటమిన్ సి, ప్రక్టోజ్ ఉండటంవల్ల రెండిటిలో ఏది పెరిగినా కూడా వాపు సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి జామను ఎక్కువగా తీసుకుంటే కడుపు మంట కూడా వచ్చే అవకాశం ఉంది.
పేగు వ్యాధి ఉన్నవారు: జామలో అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఎక్కువగా మోతాదులో జామ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది.
మధుమేహంతో బాధపడే వాళ్ళు: ఈ సమస్యతో బాధపడే వాళ్ళు జామను ఎక్కువగా తీసుకోకూడదు. 100 గ్రాముల తరిగిన జామలో తొమ్మిది గ్రాముల సహజ చక్కెర ఉంటుంది కాబట్టి జామని ఎక్కువగా తినడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతాయి.
ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు రాత్రివేళలో జామ పండును తినరాదు. మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జామపండుకు దూరంగా ఉండాలి. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండటం వలన మూత్రం ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వారు ఈ పండుకు దూరంగా ఉండటం మంచిది.