Health : ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు అవసరం. చాలా వరకు తినే ఆహారం కల్తీ రూపంలో లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగా ఉంటేనే ఏదైనా చేయగలము. ప్రతి చిన్న విషయానికి వైద్యులను సంప్రదించడం, రకరకాల మెడిసిన్స్ వాడటం జరుగుతుంది. అదే మన ఇంటి పెరట్లో కొన్ని ఔషధ మొక్కలను పెంచుకున్నట్లయితే చాలా అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. అలాంటి ఔషధ మొక్కల వివరాలు ఏంటో చూద్దాం.
వాము: వాములో చాలా సువాసన ఉంటుంది. ముఖ్యంగా ఈ వాము వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అజీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం వీటికి ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. కేవలం వాము మొక్క నుంచి చిన్నకాడను వేరు చేసి మట్టిలో నాటితే అది బాగా పెరుగుతుంది.
పుదీనా: పుదీనా ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకలి బాగా వేస్తుంది. ఆహారం బాగా జీర్ణం అయ్యి అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. దీని ఆకులలో మంచి సువాసన ఉంటుంది. చెట్టు నుంచి ఒక ఆకులు తుంచి నాటితే చెట్లలా పెరుగుతాయి.
కొత్తిమీర: ఇంట్లో వండుకునే అన్ని కూరలలో దాదాపుగా కొత్తిమీరని వాడతారు. కొత్తిమీర వల్ల కూడా చాలావరకు అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. ధనియాలను తడి మట్టిలో వేస్తే కేవలం రెండు వారాల్లోనే కొత్తిమీర పెరుగుతుంది. ఇంట్లో అన్ని వంటకాల్లో దీని వాడతారు.
మెంతి: మెంతిలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఇవి షుగర్ లెవల్స్ ను చాలా వరకు కంట్రోల్ లో ఉంచుతాయి. శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా బయటకు పంపించి వేస్తాయి. మెంతి గింజలను తడి మట్టిలో వేసి రోజు నీళ్లు పోయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మొక్కలుగా పెరుగుతుంది. వీటిని ఇంట్లో వంటకాల్లో వాడుకోవచ్చు.
ఆవాలు: ఆవాలలో క్యాన్సర్ కణాలను తగ్గించే లక్షణాలు ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్లో ఉంచుతాయి. ఇవి రకరకాల బ్యాక్టీరియా సూక్ష్మజీవులు శరీరంపై హాని చేయకుండా కాపాడతాయి. ఆవాలను తడి ఇసుకలో వేస్తే రెండు లేదా మూడు రోజుల్లోనే మొలకలు వస్తాయి వీటిని అన్ని రకాల వంటలలో వాడుకోవచ్చు.
అల్లం: చాలామంది అల్లాన్ని కూరలలో బాగా వినియోగిస్తారు. ఒక చిన్న అల్లం ముక్కను తడి ఇసుకలో ఉంచితే కేవలం రెండు మూడు వారాల్లోనే అది పెద్దగా పెరుగుతుంది. ఈ అల్లం ద్వారా చాలా అనారోగ్య సమస్యలు దరిచేరవు.
తులసి: తులసి అనేది ఒక మంచి ఔషధం. దీనిని చాలా రకాల మందులలో వినియోగిస్తారు. కాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులు తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. అయితే ముఖ్యంగా సూర్యోదయం కంటే ముందు, సూర్యాస్తమం తర్వాత వీటి ఆకుల్ని పువ్వుల్ని తుంచకూడదని పండితులు సూచించారు.
ఉల్లి: ఉల్లి వేర్లను వేరుచేసి తడి మట్టిలో ఉంచితే రోజు రోజుకు కాడ పెరుగుతుంది. ఈ కాడలను కూర లాగా చేసుకుని తినవచ్చు. వేర్లు నాటిన 100 రోజులకు ఉల్లిగడ్డ తయారవుతుంది. ఇంట్లో వాడే అన్ని వంటలలో ఉల్లిగడ్డలను విరివిగా వినియోగిస్తారు.