Sitaphal Benefits: ప్రస్తుతం కాలంలో సీతాఫలం ఎక్కువగా మార్కెట్లో లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క సీజన్లో ఒక్కోరకమైన పండ్లు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. వర్షాకాలంలోనే కాకుండా చలికాలం మొదలయ్యే వరకు సీతాఫలాలు ఎక్కువగా లభిస్తూనే ఉంటాయి. సీతాఫలాన్ని ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు. సీతాఫలాన్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇష్టంగా తింటూ ఉంటారు.
సీతాఫలంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయి.బరువు తగ్గాలనుకునేవారు సీతాఫలం పనుండుని సీతాఫలాన్ని తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.
డయాబెటిస్ పేషంట్లకు కూడా సీతాఫలం ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే సీతాఫలంలో ఎన్నో రకాల విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి.సీతాఫలం తినడం వల్ల అసిడిటీ అల్సర్లను తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సీతాఫలం తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అయితే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. సీతాఫలం తినడం వల్ల జుట్టు మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. సీతాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత రాకుండా ఉంటుంది.
సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడంవల్ల, డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.
సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. కాబట్టి సీతాఫలాన్ని ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. అంతేకాకుండా సీతాఫలాన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
సీతాఫలాన్ని తగిన మోతాదులో తింటే ఆరోగ్యానికి మంచిదా..
అలాగే ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. కాబట్టి సీతాఫలాన్ని తగిన మోతాదులో తింటే మనిషి ఆరోగ్యానికి ఎంతో మంచిది