Interview: ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఇంటర్వ్యూ అంటే చాలామంది కంగారు పడతారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన కూడా.. అనుకోకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే ఇంటర్వ్యూలో రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు, కొన్ని సింపుల్ చిట్కాలు తెలిస్తేనే ఇంటర్వ్యూలో సక్సెస్ కాగలము.
మామూలుగా అయితే ఇంటర్వ్యూ అంటే ప్రశ్నలు అడుగుతారు కరెక్ట్ సమాధానం చెబితే సరిపోతుంది అనుకుంటే అది పొరపాటు. సమాధానాలతో పాటు ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్న కాసేపు మన చిన్న కదలికను కూడా గమనిస్తారు. ఎవరైతే బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తారో వాళ్లనే సెలెక్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్. మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే కానీ ఇంటర్వ్యూ లో సక్సెస్ కాలేము. పర్సనాలిటీ నిపుణులు సూచించిన సులువైన టిప్స్ ఏంటో చూద్దాం.
ఇంటర్వ్యూ రూమ్ లోకి స్మైలింగ్ ఫేస్ తో ఎంట్రీ ఇవ్వాలి. తర్వాత మీలో చాలా కాన్ఫిడెంట్ ఉంది అనేది అవతల వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించాలి. అప్పుడే ఒక గుడ్ ఒపీనియన్ అనేది ఇంటర్వ్యూ చేసే వాళ్లకు కలుగుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ల కళ్ల వైపే చూస్తూ సమాధానం కాన్ఫిడెంట్ గా చెప్పాలి.
అప్పుడు ఎదుటివారికి అర్థమవుతుంది మీకు ఎంతో ఆసక్తి ఉందన్న విషయం. ఒకవేళ ఇంటర్వ్యూ రూమ్ లో ఇద్దరు లేదా ముగ్గురు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే.. అందరి వైపు చూస్తూ సమాధానాలు ఇవ్వాలి. ముఖ్యంగా కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుకకు కూర్చోకుండా ముందుకు కూర్చోవాలి. ఇలా చేయడం ద్వారా ఎదుటివారికి నచ్చుతారు.
ముఖ్యంగా ఇంటర్వ్యూలో గుర్తు ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఎదుటివారు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెబుతూ అందులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయండి. దీని ద్వారా మీకు కాస్త టెన్షన్ తగ్గుతుంది. ఎదుటి వాళ్లకు మీపై మంచి అభిప్రాయం ఏర్పడి మీ సమాధానంతో ఏకీభవిస్తారు. ఇక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పిన తర్వాత వాళ్లు ఏదైనా అంటే పట్టుదలతో మాట్లాడకుండా అలాగా సార్, అలా కూడా అయ్యుండవచ్చు, అంటూ మాట్లాడాలి.
తరువాత మీరు ప్రెషర్ అయితే పరవాలేదు కానీ, మీకు ఎక్స్పీరియన్స్ గనుక ఉంటే కచ్చితంగా ప్రస్తుతం మీరు పని చేస్తున్న కంపెనీ గురించి ప్రశ్నిస్తారు. అలాంటప్పుడు మీరు పనిచేసే కంపెనీ గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. అందులో మీ బాస్ ప్రవర్తన చాలా మంచిది అని చెప్పాలి. మీరు ఆ కంపెనీ నుండి బయటికి రావడానికి మీ వైపే ఏదో ఒక కారణం ఉందని చూపించాలి.
Interview: ఇంటర్వ్యూలో ఎదుటివారు అడిగే ప్రశ్నలకు సింపుల్ సమాధానాలు?
తరువాత ఇంటర్వ్యూలో ఎదుటివారు అడిగే ప్రశ్నలకు సింపుల్గా సమాధానాలు చెప్పాలి. పెద్దగా చెబుతూ టైం వేస్ట్ చేయకూడదు. ఒకవేళ వారు అడిగిన ప్రశ్నకు మీ వద్ద సమాధానం లేకపోతే, తప్పుడు సమాధానం చెప్పకుండా తెలియదు సార్ తప్పకుండా తెలుసుకుంటాను అని సమాధానం చెప్పాలి. అప్పుడు మీ నిజాయితీ వాళ్లకు నచ్చుతుంది.
ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు ఇదే మీ ఆఖరి ఇంటర్వ్యూ అనుకోవాలి. ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుంది అనేది ఊహించుకొని రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాము. ఈ ఇంటర్వ్యూ కాకపోతే మరో ఇంటర్వ్యూ కి వెళ్లొచ్చు కదా అనే ఆలోచన తీసేయండి. ఈ టిప్స్ తో సులభంగా ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ కావచ్చు.