Govt Services : మీకు ఏదైనా ప్రభుత్వ సేవ కావాలంటే ఏం చేస్తారు. దానికి సంబంధించిన వెబ్ సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకుంటారు అంతే కదా. కానీ.. దానికి సంబంధించిన వెబ్ సైట్ ఏది ఉంది అనేది తెలుసుకోవడం ఒక్కోసారి కష్టం అవుతుంది. దానికి సంబంధించిన కరెక్ట్ వెబ్ సైట్ ఏదో తెలుసుకోవాలంటే ఒక్కోసారి దొరక్కపోవచ్చు. ఒకరికి ఆధార్ కార్డులో ఏదైనా సమస్య ఉండొచ్చు. ఆదార్ కు సంబంధించి ఏదైనా అప్ డేట్ చేసుకోవాల్సి ఉండొచ్చు. పాన్ కార్డులో పేరు కరెక్షన్ కోసమో.. ఇంకా దేనికోసమో లేదా కొత్త పాన్ కార్డును దరఖాస్తు చేసుకుంటారు. ఇలా.. ప్రభుత్వానికి సంబంధించిన చాలా సర్వీసుల కోసం ప్రజలు రోజూ రకరకాల వెబ్ సైట్లకు లాగిన్ అవుతుంటారు.
ఇలా పాన్ కార్డు కోసం, ఆధార్ కార్డు కోసం, ఓటర్ ఐడీ కార్డు కోసం, ఇంకా వేరే సర్వీసుల కోసం వాటికి సంబంధించిన వెబ్ సైట్లను ఓపెన్ చేసేకంటే కూడా.. అన్ని సర్వీసులు ఒకేచోట దొరికితే బెటర్ కదా. అందుకే కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వం అందించే అన్ని సర్వీసులకు ఒకేచోట చేర్చింది. ఒకే వెబ్ సైట్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న 12 వేల కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
Govt Services : ఇంతకీ ఏంటి ఆ వెబ్ సైట్?
12 వేల కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు ప్రస్తుతం ఒకే వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అదే services.india.gov.in వెబ్ సైట్. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని ప్రభుత్వ సర్వీసులు కనిపిస్తాయి. నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ పేరుతో దాన్ని తీసుకొచ్చాడు. అందులో అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ సర్వీసులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కూడా అందులో ఉంటాయి.
అందులో ఫిల్టరింగ్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. అంటే.. మీది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ సర్వీసులు కావాలంటే.. మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకొని.. ఆ రాష్ట్రంలోని సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సర్వీస్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్తుంది. అక్కడికెళ్లి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవలే ఈ సర్వీసును కేంద్రం తీసుకొచ్చింది. ఇంకా అన్ని సర్వీసులు అందుబాటులోకి రాలేదు. త్వరలోనే అన్ని సర్వీసులు ఈ పోర్టల్ లో అందుబాటులోకి రానున్నాయి.