SBI Investment : చాలామంది దగ్గర డబ్బులు ఉంటే ఏం చేయాలో అర్థం కాదు. ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియదు. బ్యాంకులో దాచుకుంటే ఏమొస్తుంది. 4 శాతం వడ్డీ కూడా రాదు. ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా వాళ్లు అడిగిన సమయానికి ఇస్తారో లేదో తెలియదు. కానీ.. మీ దగ్గర ఒక రూ.5 లక్షలు క్యాష్ ఉంటే.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు. నెలకు రూ.90 వేల వరకు డబ్బులు సంపాదించవచ్చు.
అయితే.. ఇది ఒకరకమైన బిజినెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఇది బ్యాంకులో పెట్టే పెట్టుబడి కాదు. ఎస్బీఐ ఈ డబ్బుతో బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎస్బీఐకి ఏటీఎంలు ఉన్నాయి కానీ.. చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి పట్టణంలో, గ్రామాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేయడం చాలా రిస్క్, కష్టం. అందుకే.. ప్రజలకే వాళ్ల సొంత ఏటీఎం పెట్టుకునే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది.
ఎస్బీఐ అనేది ప్రపంచంలోనే టాప్ 500 కంపెనీలో 236వ ర్యాంకు. ప్రపంచంలోనే టాప్ బ్యాంక్. భారత్ లో కూడా నెంబర్ వన్ బ్యాంక్ కాబట్టి.. ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వస్తుంది అనేది ఉండదు. ఎస్బీఐలో అకౌంట్ ఉండి, ఆధార్, పాన్ కార్డు ఉండి, ఒక చిన్న రూమ్ ఉంటే చాలు. వెంటనే ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసుకోవచ్చు.
SBI Investment : ఈ బిజినెస్ లోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలి?
మీ ప్రాంతంలో ఏటీఎం పెట్టాలనుకుంటే అది కొంచెం బిజీ ప్రాంతం అయి ఉండాలి. రోజుకు కనీసం ఆ ఏటీఎం ద్వారా 300 వరకు లావాదేవీలు జరిగే అవకాశం ఉండాలి. కనీసం 300 వరకు లావాదేవీలు జరిగితే నెలకు కనీసం 45 వేల ఆదాయం వస్తుంది. అదే 500 వరకు లావాదేవీలు రోజూ జరిగితే 90 వేల వరకు ఆదాయం వస్తుంది. అయితే.. ఇది డైరెక్ట్ ఎస్బీఐ ఏటీఎంగా ఉండదు. దీన్ని వైట్ లేబుల్ ఏటీఎం అంటారు. వాళ్లకు ప్లేస్ చూపిస్తే చాలు.. ఏటీఎం మిషన్ అన్నీ వాళ్లే అమర్చిపోతారు. దీనికి సంబంధించి దరఖాస్తు విధానం గురించి తెలియాలంటే మీకు సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ని సంప్రదిస్తే దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో బ్యాంకు సిబ్బంది తెలియజేస్తారు.
కాకపోతే మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే చాలు. ఒకవేళ మీకు దగ్గర్లో ఎస్బీఐ బ్యాంక్ లేకపోతే ఎస్బీఐ బ్యాంకు వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు, ఏటీఎం పెట్టే ప్లేస్ అన్ని వివరాలు అందులో నమోదు చేస్తే చాలు. బ్యాంకు వాళ్లే మిమ్మల్ని సంప్రదిస్తారు.