ఆచార్య చాణిక్యుడు మానవ మనుగడకు దోహదపడే అనేక ప్రాథమిక విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఈ నీతి శాస్త్రం ఆధారంగా ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు.. ఎలాంటి వారికి సహాయం చేయకూడదు.. ఎలాంటి వారితో దూరంగా ఉండాలి అనే విషయాలు చక్కగా వివరించడం జరిగింది. అవేమిటో చూద్దాం.
దుష్ట స్వభావం గల స్త్రీ: ఇలాంటి స్వభావం ఉన్న స్త్రీలు ఎక్కువగా ఇతరులను కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మన సంతోషాలను ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళతో అస్సలు పంచుకోకూడదు. వీళ్లలో ఓర్వలేని తనం చాలా ఎక్కువ. ఇలాంటి స్త్రీలు స్వలాభం గురించే ఆలోచిస్తారు. మంచి చెడ్డలు వీరికి పట్టవు. ఇటువంటి వారికి సహాయం, సలహాలు లాంటివి చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. చాళుక్యుని నీతి శాస్త్రం ప్రకారం పాముకు కోరల్లో విషముంటే వీరికి ఒళ్లంతా విషమే ఉంటుంది. ఇటువంటి వారికి సహాయం చేసే గుణం అస్సలు ఉండదు.
మూర్ఖులు: ఇతరులను అర్థం చేసుకునే స్వభావం లేని వారిని మూర్ఖులుగా పరిగణిస్తారు. మూర్ఖులు తప్పొప్పులు పక్కన పెట్టి వారు చెప్పిందే వేదం అన్నట్టుగా వాదిస్తారని చాళుక్కుని నీతి శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. మూర్ఖులకు ఎంత దూరంగా ఉంటే.. అంతా ప్రశాంతతను పొందవచ్చు. మూర్ఖుడు ఎప్పుడు ఎదుటి వారిపై అన్యాయంగా గెలవడానికి ప్రయత్నిస్తాడు. మూర్ఖులతో స్నేహం చేయడం అంటే మన చేతులతో మనమే మన జీవితం నాశనం చేసుకున్నట్లే. ఇటువంటి వారికి సలహాలు ఇవ్వడం.. ఇటువంటి వారి సలహాలు తీసుకోవడం అనేవి ఎదుటివారి నాశనానికే దోహదపడతాయి.
తెలివి తక్కువ వ్యక్తులు: ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తులకు ఎంత అర్థమయ్యేలా చెప్పిన వీరు వినరు. ఇటువంటి వారితో కలిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితంలో అభివృద్ధి చెందలేదు అనేది చాణిక్యుని నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు జీవితంలో అస్సలు పైకి ఎదగరు. వీరితో స్నేహం చేసే వారిని కూడా పైకి ఎదగనీయరు. వీరి పక్కన ఉంటే వీరు చేసే తెలివి తక్కువ పనులకు బాధ్యత మనదే అవుతుంది. ఇటువంటివారు ఆనందంగా ఉండే రోజులు చాలా తక్కువ. ఎక్కువగా విచారంగా.. నెగటివ్ ఆలోచనలతో ఉంటారు. వీరి స్నేహం అసలు మంచిది కాదు.
చాణిక్యని నీతి శాస్త్రం ప్రకారం చెడ్డవారికి దూరంగా ఉండటమే మంచి మనిషి ఉత్తమ లక్షణం. ఎదుటివారి మనసును అర్థం చేసుకోలేని వారితో మనం ఉండడం అవివేకం అవుతుంది. చెడ్డవాళ్ళు ఎప్పుడు పక్కవారి నాశనాన్ని కోరుకుంటారు, పక్కవారి ఎదుగుదలకు నిరంతరం అడ్డుపడతారు. మనకు సంబంధించిన విషయాలను పక్కవారితో పంచుకుంటే ఆ సమస్యను వాళ్లు ఇంకా పెంచే ఆస్కారం ఉంది. అవునా మన సమస్యలను ఎదుటి వాళ్ళతో పంచుకునే కంటే మనమే ప్రశాంతంగా ఆలోచిస్తేనే పరిష్కారాలు దొరుకుతాయి అని నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించడం జరిగింది.