ప్రగతి తెలుగు సినీనటిగా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. చదువుకునే రోజుల్లో మైసూర్ ప్యాలెస్ వారి ఒక యాడ్ లో నటించడం జరిగింది. ఆ యాడ్ చూసిన తమిళ దర్శకుడు కే. భాగ్యరాజ్ ”వీట్ల విశేషాంగా” లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇక వరుస అవకాశాలతో 2 సంవత్సరాలలో ఏడు సినిమాలలో నటించడం జరిగింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి సహాయక పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాతో పంచుకుంటుంది.
ప్రస్తుతం ప్రగతి రెమ్యూనరేషన్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సినిమాకు హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో.. తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలో కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా ముఖ్యం. వీరి పారితోషకం కూడా భారీగానే ఉంటుంది. ఇక ప్రగతి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే సినిమాను బట్టి ఒక్క రోజుకు 50 వేల నుంచి 70 వేల వరకు పారితోషకం తీసుకుంటుందట. ఇటీవలే కాలంలో విడుదలైన ఎఫ్ త్రి సినిమాలో కూడా భారీగానే పారితోషకం తీసుకుంది. ఇక ప్రగతి ఎక్కడికి వెళ్లిన తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
లాక్ డౌన్ సమయంలో ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో హూ అంటావా మామ పాటకు డాన్స్ చేసిన వీడియో ద్వారా కుర్ర కారులో అలజడి సృష్టించింది. ఈ వీడియో వైరల్ గా మారి చాలామంది సోషల్ మీడియా లో ప్రగతికి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇక ఈ విషయాలతో పాటు ప్రగతి గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను కూడా కెరీర్ ప్రారంభంలో చాలామంది దర్శక నిర్మాతలు సినిమా అవకాశాల కోసం క్యాస్టింగ్ ప్రస్తావన తెస్తే తాను అటువంటి సినిమాలను వదులుకోవడం జరిగింది అని తెలిపింది.
అంతేకాకుండా ఒక ప్రముఖ హీరో కూడా సినిమా అవకాశాలు ఇప్పిస్తానని తనను చాలా వేధించాడని.. కానీ తను సినిమా అవకాశాలు వచ్చిన, రాకపోయినా తన వ్యక్తిత్వం తనకు ఎంతో ముఖ్యం అంటూ ఎన్నో సినిమా అవకాశాలను కావాలని వదులుకున్నట్లు తెలిపింది. ఆ వేధించిన హీరో వివరాలు మాత్రం బయట ఎక్కడ వెల్లడించలేదు.
తాను తన టాలెంట్‌ను మాత్రమే నమ్ముకున్నానని.. ఎంతమంది సినిమా అవకాశాలు ఇప్పించిన తనలో టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎలా రాణించగలుగుతాను అంటూ అభిప్రాయపడింది. అడపాదడపా అవకాశాలతోనే గుర్తింపు పొంది చివరకు ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులలో తాను కూడా చేరిపోయింది. ప్రగతి నటించిన ఎఫ్ 3 సినిమా విజయం సాధించడంతో.. ప్రస్తుతం ఈమె రెండు మూడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.