Free Books : మీకు ఏదైనా పుస్తకం చదవాలని ఉందా? వెంటనే ఆ పుస్తకాన్ని షాపునకు వెళ్లి కొంటున్నారా? లేదా ఆన్ లైన్ లో ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా? ఆగండాగండి. ఎందుకంటే.. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఏ బుక్ అయినా పొందొచ్చు. కొత్తగా విడుదల అయిన బుక్స్ కూడా మీకు దొరుకుతుంది. ఉచితంగా ఎన్ని పుస్తకాలు అయినా చదవొచ్చు. దాని కోసం మీరు చేయాల్సింది ఒక్కటే.
దాని కోసం మీరు చేయాల్సింది ఒక్కటే. Zlibrary.cc అనే వెబ్ సైట్ లోకి వెళ్లి మీకు కావాల్సిన బుక్ ను డౌన్ లోడ్ చేసుకోవడమే. ఇందులో తెలుగు బుక్స్ కూడా ఉంటాయి. పాపులర్ బుక్స్ కూడా ఇందులో ఉంటాయి. కొత్తగా విడుదలైన బుక్స్, అన్ని భాషల బుక్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. బిజినెస్, కెరీర్, టైమ్ మేనేజ్ మెంట్, సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్, హెల్త్, ఫిట్ నెస్, పేరెంటింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, అకాడెమిక్, ఎడ్యుకేషన్, స్పిరిచ్యుయాలిటీ, రిలీజియన్, ఎకనామిక్, సాఫ్ట్ వేర్, టెక్నాలజీ, చిల్డ్రన్, యూత్, బయాలజీ, హిస్టరీ, ఇంజనీరింగ్, ఎన్విరాన్ మెంట్, సైకాలజీ.. ఇలా అన్ని రకాల కేటగిరీల పుస్తకాలు ఇందులో ఉచితంగా దొరుకుతాయి.
Free Books : కొన్ని లక్షల పుస్తకాలు లభ్యం
ఇది ఒకరకంగా చెప్పాలంటే ఆన్ లైన్ లైబ్రరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. మామూలుగా ఫిజికల్ పుస్తకాలు ఒకేచోట ఉంచితే అది లైబ్రరీ అవుతుంది. అదే.. పుస్తకాల పీడీఎఫ్స్ అన్నీ ఒకేచోట దొరికితే అదే ఈ ఆన్ లైన్ లైబ్రరీ. ఈ ఆన్ లైన్ లైబ్రరీలో మీకు నచ్చిన పుస్తకాన్ని జస్ట్ పుస్తకం పేరును సెర్చ్ లో టైప్ చేస్తే కింద మీకు కావాల్సిన పుస్తకం పీడీఎఫ్ ను చూపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకొని మీకు నచ్చినప్పుడు పుస్తకాన్ని చదువుకోవచ్చు.
ఒకవేళ మీకు ఏదైనా పుస్తకం చదివే సమయం లేకపోతే.. జస్ట్ సింపుల్ గా యూట్యూబ్ లోకి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన పుస్తకం పేరు టైప్ చేసి ఆడియో బుక్ అని సెర్చ్ చేస్తే ఆ బుక్ కు సంబంధించిన ఆడియోను వినొచ్చు. ప్రత్యేకంగా పుస్తకాన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు.
ఈ మధ్య పుస్తకాల ఆడియోకు సంబంధించి చాలా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. పుస్తకాన్ని చదివే అవసరం లేకుండా ఆడియో వింటూ పుస్తకాలను ఏం చక్కా చదివేయొచ్చు. లేదంటే.. ఫిజికల్ గా పుస్తకాలను కొనకుండా.. ఫ్రీగా పీడీఎఫ్స్ కూడా చదివేయొచ్చు.