Amazon OTP Delivery Scam : ఈరోజుల్లో ఆన్ లైన్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. ఈకామర్స్ వెబ్ సైట్లు కూడా చాలా వచ్చాయి. కూరగాయలు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నాం. ప్రతి చిన్న వస్తువు అయినా.. పెద్ద వస్తువు అయినా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడం అనేది కామన్ గా మారింది. అందుకే ఆన్ లైన్ ఆర్డర్ ను ఆధారంగా చేసుకొని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అసలు ఆన్ లైన్ లో మనం ఆర్డర్ చేస్తే సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అని ఆశ్చర్యపోతున్నారా? పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
ఉదాహరణకు మీ ఇంటికి ఒక పార్శిల్ వచ్చింది అనుకుందాం. కానీ.. ఆ పార్శిల్ మీరు ఆర్డర్ చేయలేదు. కానీ.. ప్రముఖ ఈకామర్స్ సంస్థ నుంచి వచ్చిందని.. అది మీరే ఆర్డర్ చేశారని డెలివరీ బాయ్ అంటాడు. దీంతో నేను చేయడం ఏంటి.. నేను చేయలేదు అని మీరు అంటారు. అడ్రస్, పేరు అన్నీ కరెక్ట్ గానే చెబుతాడు ఆ డెలివరీ బాయ్. అయినా కూడా అది నేను ఆర్డర్ చేయలేదు అంటారు మీరు. కానీ.. ఇక్కడ అసలు ఆ ప్రాడక్ట్ ను మీ పేరు మీద ఆర్డర్ చేసింది ఎవరంటే.. సైబర్ నేరగాళ్లు. అవును.. మీ వివరాలన్నీ తెలుసుకొని కావాలని మీ పేరు మీద ఆర్డర్ పెడతారు. దాన్ని మీరు ఎలాగూ తీసుకోరు కాబట్టి అక్కడే సైబర్ నేరానికి తెర లేపుతారు.
Amazon OTP Delivery Scam : మన అకౌంట్ ను ఎలా ఖాళీ చేస్తారు?
అమెజాన్ లో ఆర్డర్ చేసినట్టు వచ్చిన పార్శల్ ను మీది కాదని అంటారు. అయితే.. అప్పటికే సైబర్ నేరగాళ్లు మీ కార్డు వివరాలను తస్కరించి ఉంటారు. అంటే మీ కార్డు నెంబర్, సీవీవీ, ఎక్స్ పైరీ డేట్ అన్నీ వాళ్ల వద్ద ఉంటాయి. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేయడానికి వెయిట్ చేస్తుంటారు.
ఎప్పుడైతే ఆ పార్శిల్ మీది కాదని అంటారో అప్పుడు డెలివరీ బాయ్ ఓటీపీ చెప్పండి అంటాడు. ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం. మీ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. అది చెప్పండి అని అడుగుతారు. మీరు ఆవేశపడి ఓటీపీ చెబుతారు. ఆ ఓటీపీ వెంటన సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. అంతే.. ఆ ఓటీపీ ద్వారా మీ బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేస్తారు సైబర్ నేరగాళ్లు. అందుకే.. ఇలాంటి ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్ ఓటీపీ స్కామ్ లో చిక్కుకోకండి.