Recovery Agents : లోన్ రికవరీ ఏజెంట్స్ తెలుసు కదా. బ్యాంక్ లోన్ తీసుకొని నెలనెలా క్రమం తప్పకుండా ఈఎంఐలు కట్టకపోతే ఇక అంతే. లోన్ రికవరీ ఏజెంట్ల టార్చర్ తట్టుకోలేం. ఈఎంఐ పే చేయకపోతే బ్యాంకు వాళ్ల కంటే కూడా లోన్ రికవరీ ఏజెంట్ల టార్చర్ ఎక్కువవుతుంది. కంటిన్యూగా ఫోన్లు చేస్తారు. ఈఎంఐ కట్టలేదని టార్చర్ పెడతారు. ఇంటికి వస్తామని బెదిరిస్తారు. కానీ.. లోన్ ఈఎంఐ కట్టకపోతే లోన్ రికవరీ ఏజెంట్లకు ఇంటికి వచ్చే హక్కు ఉందా? ఫోన్లు చేసి వేధించే హక్కు ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి వరుసగా మూడు సార్లు అంటే మూడు నెలలు ఈఎంఐ కట్టకపోతేనే లోన్ రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చే అర్హత ఉంటుంది. అది కూడా మూడు నెలలు వరుసగా ఈఎంఐ కట్టకపోతే ముందు ఫోన్ ద్వారా ఆ విషయాన్ని కస్టమర్ కి చెప్పాల్సి ఉంటుంది. మెయిల్స్, మెసేజెస్ ద్వారా చెప్పినా కూడా అప్పటికీ కస్టమర్ ఈఎంఐ పే చేయకపోతే అప్పుడు లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. అప్పటికీ మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్లు మీపై సూట్ ఫర్ రికవరీ ఆఫ్ మనీ అని కేసు పైల్ చేయవచ్చు.
Recovery Agents : ఇంటికి వచ్చి రికవరీ ఏజెంట్లు టార్చర్ చేస్తే ఏం చేయాలి?
ఇంటికి వచ్చి రికవరీ ఏజెంట్లు టార్చర్ చేసే హక్కు అస్సలే ఉండదు. ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడం కానీ.. అసభ్యంగా ప్రవర్తించడం కానీ చేసే రైట్ వాళ్లకు లేదు. పైన చెప్పినట్టుగా కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే కోర్టులో సూట్ ఫర్ రికవరీ కేసు వేయాలి.
అలా కాకుండా ఇంటికి వచ్చి రికవరీ ఏజెంట్లు టార్చర్ చేస్తే, బెదిరిస్తే, నలుగురిలో అవమానిస్తే వాళ్ల మీద వెంటనే కేసు ఫైల్ చేయొచ్చు. మీ ఆఫీసుకు వచ్చినా, మీ ఇంటికి వచ్చినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఐపీసీ సెక్షన్ 441, 500 ప్రకారం వాళ్ల మీద కేసు ఫైల్ చేయొచ్చు.
అంతే కానీ.. మీ ఇంటికి వచ్చి ఈఎంఐ పే చేయలేదని ఏ బ్యాంకు వారికి కానీ.. రికవరీ ఏజెంట్లకు కానీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసే హక్కు, అధికారం లేదు. అలా చేస్తే వాళ్ల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. రికవరీ ఏజెంట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే వాళ్ల మీద కేసు ఫైల్ చేయడమే. లేదంటే వాళ్లు కంటిన్యూగా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతారు. ఒకవేళ రికవరీ ఏజెంట్ల బాధ నుంచి తప్పించుకోవాలంటే మీరు లోన్ తీసుకున్న బ్యాంకుకు వెళ్లి మీ పరిస్థితి వివరించి.. ఈఎంఐ మీద కొన్ని రోజుల పాటు మారటోరియం వేయాలని బ్యాంకు వారిని కోరొచ్చు. అంటే కొన్ని నెలల పాటు ఈఎంఐ కట్టలేనని బ్యాంకు వాళ్లకు చెబితే అన్ని నెలల పాటు ఈఎంఐని ఆపేస్తారు. మళ్లీ మీకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కట్టడం స్టార్ట్ చేయొచ్చు.