Credit Card Bill : చాలామంది టైమ్ కు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతారు. మనం మనుషులం అవసరానికి డబ్బులు ఉండవు. ఎవ్వరిని అడిగినా ఇవ్వరు. అదే సమయంలో క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే కష్టం అవుతుంది. క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి కట్టకపోతే ఇక ఉంటుంది.. బ్యాంకు వాళ్లు, ఏజెంట్లు ఫోన్లు చేసిన సావదొబ్బుతుంటారు. ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి. ఏజెంట్లు ఇంటికి కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. కానీ.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతే ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేయకూడదు. అది తప్పు.
ఏవైనా సమస్యలు ఉంటే బిల్లు కట్టలేకపోతే క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్లు వాళ్లపై సివిల్ కేసు ఫైల్ చేయొచ్చు. అంతే కానీ.. వాళ్ల ఇంటికి వచ్చి, వాళ్ల ఆఫీసులకు వచ్చి పరువు తీయడం కరెక్ట్ కాదు. అలా ఎవరైనా చేస్తే మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు. అలాగే.. క్రెడిట్ కార్డు కంపెనీలు కూడా సివిల్ కేసు ఫైల్ చేయలేరు. అది అసాధ్యం. అస్సలు కుదరదు. జైలుకు పంపిస్తారు అంటూ కొందరు భయపడతారు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోతే ఎవ్వరూ జైలుకు పంపించరు. క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం కూడా అసాధ్యం.
Credit Card Bill : బిల్లు కట్టలేని వాళ్లు ఇలా చేయండి
మీరు బిల్లు కట్టలేకపోతే ఏం టెన్షన్ పడకండి. క్రిమినల్ కేసులు పైల్ చేస్తారని అనుకోకండి. ఎందుకంటే మీరు బిల్లు కట్టలేకపోయినా ఏ కంపెనీ వాళ్లు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు. మీ మీద సివిల్ కేసు ఫైల్ చేస్తారు. రికవరీ సూట్ ఫైల్ చేస్తారు.
రికవరీ సూట్ ఫైల్ చేస్తే కోర్టు విచారణకు పిలుస్తుంది. అప్పుడు వెళ్లి జడ్జి ముందు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత సమయం కావాలని, లేదంటే ఈఎంఐ రూపంలో పే చేస్తానని జడ్జి ముందు రిక్వెస్ట్ చేసుకుంటే జడ్జి కొంత సమయం ఇస్తారు. లేదా ఈఎంఐలో పే చేసుకునే ఆప్షన్ ఇస్తారు.
అంతే కానీ.. మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని టెన్షన్ పడకండి. దాని కోసం ఒత్తిడికి గురికాకండి. రికవరీ సూట్ వేసినా కూడా కోర్టులో మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే చాలు. జడ్జి మీ బాధను అర్థం చేసుకుంటారు. బిల్లు పే చేయడానికి మీకు తగినంత సమయం ఇస్తారు. అందుకే బిల్లు కట్టలేదని టెన్షన్ పెట్టుకొని లేనిపోని భయాలు పెట్టుకోకండి. నిశ్చింతగా ఉండండి.