Bank Pre Closure Charges : చాలామంది లోన్ తీసుకుంటారు. అది హోమ్ లోన్ కావచ్చు.. పర్సనల్ లోన్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ఏ లోన్ తీసుకున్నా నెల నెలా ఈఎంఐ సమయానికి కట్టాల్సి ఉంటుంది. సమయానికి కట్టకపోవే పెనాల్టీలు, వడ్డీలు యాడ్ చేస్తూ పోతూనే ఉంటాయి బ్యాంకులు. అందుకే చాలామంది ఈఎంఐ ప్రతి నెల కట్టలేక.. లేదా ఎందుకు ఈ లోన్ గొడవ అనుకొని మధ్యలోనే ఆ లోన్ ను క్లియర్ చేయాలని అనుకుంటారు. మధ్యలోనే ఆ లోన్ ను క్లియర్ చేసి లోన్ ను తీర్చేద్దామనుకుంటారు.
కానీ.. ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. ఎందుకంటే.. కొన్ని నెలల పాటు ఈఎంఐ కట్టిన తర్వాత ఇంకా ఎన్ని నెలల ఈఎంఐ ఉంటే.. వాటి ఈఎంఐ మొత్తం ఒకేసారి పే చేస్తే చాలు. ఇక.. ఎలాంటి చార్జీలు ఉండవు అని అనుకుంటారు. కానీ.. అది చాలా తప్పు. ఎందుకంటే.. ఉదాహరణకు మీరు ఏదైనా బ్యాంకులో రూ.5 లక్షల లోన్ తీసుకొని సమయానికి నెలనెలా ఈఎంఐలు పే చేస్తూ వెళ్తున్నారు అనుకుందాం. రెండు లక్షల వరకు మీరు తీసుకున్న లోన్ లో ఈఎంఐలతో పే చేశారు అనుకుందాం. ఇంకా మూడు లక్షలు పెండింగ్ ఉంటాయి. ఈ అమౌంట్ ను డైరెక్ట్ గా పే చేసి లోన్ క్లోజ్ చేయాలని అనుకుంటారు. కానీ.. అది కుదరదు.
Bank Pre Closure Charges : బ్యాంకులు ప్రీ క్లోజర్ చార్జీలు వేస్తాయి
అలాంటి పప్పులు మా దగ్గర ఉడకవు అని అంటాయి బ్యాంకులు. ఎందుకంటే.. మీరు లోన్ ను మధ్యలో క్లోజ్ చేస్తున్నారు కాబట్టి అది మాకు లాస్ కాబట్టి మీరు లోన్ క్లోజ్ చేయడానికి ప్రీ క్లోజర్ చార్జీలు పే చేయాల్సి ఉంటుంది అని బ్యాంకులు చెబుతాయి. ప్రీ క్లోజర్ చార్జీలనే ఫోర్ క్లోజర్ చార్జీలు అని కూడా అంటారు. ఎంత అమౌంట్ ఇంకా పే చేయాలో దాని మీద 4 శాతం వరకు చార్జీలను వసూలు చేస్తాయి బ్యాంకులు. మిగిలిన మూడు లక్షల మీద చార్జీలు అంటే 12 వేల వరకు ఫోర్ క్లోజర్ చార్జీలు వసూలు చేస్తారు.
అందుకే ప్రీ క్లోజర్ చార్జీల నుంచి తప్పించుకోవాలంటే లోన్ తీసుకొనేటప్పుడే ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్ తీసుకోవాలి. అంటే.. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇంటరెస్ట్ రేట్ పెరిగితే మీ లోన్ అకౌంట్ ఇంటరెస్ట్ రేట్ పెరుగుతుంది. తగ్గితే ఇంటరెస్ట్ రేట్ తగ్గుతుంది. ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్ మీద ప్రీ క్లోజర్ చార్జీలు, ప్రీ పేమెంట్ చార్జీలు కట్టాల్సిన అవసరం ఉండదు.
ఫిక్స్డ్ ఇంటరెస్ట్ రేట్ తీసుకుంటే మాత్రం అప్పుడు ప్రీ క్లోజర్ చార్జీలు, ప్రీ పేమెంట్ చార్జీలను బ్యాంకులు వసూలు చేయాలి. అందుకే.. లోన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనవసరంగా చార్జీలు కట్టాల్సి ఉంటుంది.