Banks Pay Penalty : చాలామంది ఏటీఎంలకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుంటారు. కానీ.. డబ్బులు డ్రా చేస్తుండగా మధ్యలో డబ్బులు రాకుండా కట్ అవుతూ ఉంటాయి. అది చాలామంది అనుభవించే ఉంటారు. డబ్బులు విత్ డ్రా చేయగానే డబ్బులు వచ్చినట్టే వస్తాయి కానీ.. ఏటీఎం నుంచి డబ్బులు రావు. అలాగే.. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. నిజానికి ఏటీఎంలో ఉండే ఎర్రర్ వల్ల అలాంటి సమస్యలు వస్తుంటాయి. డబ్బులు రాకుండా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి.
చాలామందికి ఇలా జరగగానే ముందు టెన్షన్ పడతారు. ఆ తర్వాత డబ్బులు రాలేదని వాపోతారు. ఇక ఆ డబ్బులు రావేమో అని భయపడతారు. కానీ.. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే.. బ్యాంకు వాళ్లు తిరిగి కట్ అయిన డబ్బులను అకౌంట్ లో వేస్తారు. కానీ.. దానికి టైమ్ పడుతుంది. కనీసం వారం రోజుల సమయం తీసుకుంటాయి కొన్ని బ్యాంకులు. దానికి కారణం.. ఆ అకౌంట్ లో కట్ అయిన డబ్బులు, ఏటీఎంలో ఉన్న డబ్బులు, బ్యాలెన్స్ షీట్ అన్నీ టాలీ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ లోకి రిఫండ్ చేస్తారు. కానీ.. దానికి ముందు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
Banks Pay Penalty : 5 వర్కింగ్ డేస్ లో ఇవ్వకపోతే రోజూ రూ.100 ఇస్తారు
ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు బ్యాంకులు త్వరితగతిన కస్టమర్ అకౌంట్ లో డబ్బులు వేయడం కోసం ఆర్బీఐ ఒక రూల్ తీసుకొచ్చింది. దాన్నే హార్మోనైజేషన్ ఆఫ్ టర్న్ అరౌండ్ టైమ్(టీఏటీ) అంటారు. ఏటీఎం నుంచి డబ్బులు రాకుండా అకౌంట్ లో డబ్బులు కట్ అయితే 5 వర్కింగ్ డేస్ లో ఆ కస్టమర్ అకౌంట్ లో డబ్బులు వేయాల్సి ఉంటుంది.
ఒకవేళ 5 వర్కింగ్ డేస్ లో ఆ కస్టమర్ అకౌంట్ లో డబ్బులు వేయకపోతే ఆరో వర్కింగ్ డే నుంచి ప్రతి రోజు బ్యాంకు ఆ కస్టమర్ కు రూ.100 పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు ఆ డబ్బులు వేస్తే అప్పటి వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. డబ్బులు రిఫండ్ చేసేటప్పుడు 5 వర్కింగ్ డేస్ తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ వస్తే అన్ని రోజులకు పెనాల్టీని కూడా యాడ్ చేసి రిఫండ్ చేయాల్సి ఉంటుంది.
కానీ.. కొన్ని బ్యాంకులు 5 వర్కింగ్ డేస్ దాటినా కూడా కస్టమర్లకు రిఫండ్ ఇవ్వవు. చాలా రోజుల సమయం తీసుకుంటాయి. అలాగే.. పెనాల్టీ కూడా కట్టవు. అటువంటి వాళ్లు ఆర్బీఐ అంబుడ్స్ మెన్ కి ఫిర్యాదు చేయొచ్చు.