Bank Pay Penalties : అట్టెట్ట.. బ్యాంకులు మనకెందుకు రోజూ రూ.5000 ఫ్రీగా ఇస్తాయి అంటారా? ఇస్తాయి.. బ్యాంకులు ఎప్పుడూ మన దగ్గరే పెనాల్టీలు వసూలు చేయడం కాదు. మనం కూడా బ్యాంకుల నుంచి పెనాల్టీలు వసూలు చేయొచ్చు. ఎలా అంటారా? పదండి.. వివరంగా తెలుసుకుందాం.
చాలామంది బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. లోన్ కోసం కొన్ని ష్యూరిటీలు పెడతారు. అది ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ఏం పెట్టినా కూడా అది లోన్ కంటిన్యూ అవుతున్నంత సేపే. ఆ తర్వాత లోన్ పూర్తి కాగానే ఆ డాక్యుమెంట్లను తిరిగి బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చేయాలి. బ్యాంకు లోన్ పూర్తి కాగానే బ్యాంకులు ఆ లోన్ కోసం పెట్టిన డాక్యుమెంట్లను బ్యాంకులు తిరిగి ఇచ్చేయాలి. కానీ.. కొన్ని బ్యాంకులు వెంటనే తిరిగి ఇచ్చేయవు. అటువంటప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం.
Bank Pay Penalties : లోన్ పూర్తయిన నెల రోజుల్లో బ్యాంకులు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి
నిజానికి లోన్ పూర్తయిన నెల రోజుల్లో బ్యాంకులు లోన్ కోసం పెట్టుకున్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ నెల రోజులు పూర్తయినా కూడా బ్యాంకు వాళ్లు మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చేయకపోతే వాళ్లు నెల దాటిన తర్వాత రోజూ రూ.5 వేల పెనాల్టీని కస్టమర్ కు చెల్లించాల్సి ఉంటుంది.
కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయి అంటే.. రెండు నెలల తర్వాత ఇస్తాం.. తర్వాత రండి అంటూ బ్యాంకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. ఆర్బీఐ కొత్త రూల్ ప్రకారం లోన్ క్లియర్ అయిన నెల రోజుల్లోనే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి. నెల రోజుల్లో ఇవ్వకపోతే నెల రోజుల తర్వాత రోజు నుంచి రోజుకు రూ.5 వేల చొప్పున బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు వాళ్లు ఎన్ని రోజులు లేట్ చేస్తే రోజుకు రూ.5 వేల చొప్పున కస్టమర్ కి పెనాల్టీ చెల్లించాల్సిందే.
ఒకవేళ నెల రోజులు దాటినా మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ను బ్యాంకులు ఇవ్వకపోతే, కొన్ని రోజుల తర్వాత రండి ఇస్తాం.. పెనాల్టీ ఏం చెల్లించం అని బ్యాంకులు దబాయిస్తే వెంటనే ఆ బ్యాంకు మీద ఆర్బీఐ అంబుడ్స్ మెన్ కు మీరు వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. దీంతో ఆర్బీఐ అధికారులు ఆ బ్యాంకు మీద వెంటనే చర్యలు తీసుకుంటారు. మీ పెనాల్టీ మీకు వచ్చేలా చేస్తారు. అలాగే మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీకు వచ్చేలా చేస్తారు.