Credit Card Charges : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? షాపింగ్ చేసేటప్పుడు మీకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. చాలాసార్లు మీరు ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు. ఎప్పుడైనా మీరు షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే కొందరు చార్జీలు పే చేయాలంటారు. మామూలుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేసినా.. డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసినా రూపాయి కూడా ఎక్కువగా తీసుకోరు. కానీ.. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినా ఖచ్చితంగా 2 శాతం ఎక్కువ చార్జ్ అవుతుంది అంటారు. అంటే.. మీరు ఒక 10 వేల రూపాయల వస్తువు ఏదైనా తీసుకుంటే.. 200 ఎక్కువ చార్జ్ పే చేయాల్సి వస్తుంది.
కానీ.. 2 శాతం ఖచ్చితంగా అదనంగా పే చేయాలా? అసలు క్రెడిట్ కార్డు ద్వారా పే చేస్తే ఎందుకు షాపు వాళ్లు 2 శాతం ఎక్కువ చార్జ్ తీసుకుంటారు అని అనుకుంటున్నారా? 2 శాతం ఎందుకు అని ప్రశ్నిస్తే బ్యాంకు చార్జీలు అంటారు. కానీ.. నిజానికి ఆ 2 శాతం మర్చంట్స్ అంటే షాపు వాళ్లు బ్యాంకు వాళ్లకు కట్టాలి. కానీ.. ఆ చార్జీని మర్చంట్స్.. కస్టమర్ల నుంచి వసూలు చేస్తుంటారు. బ్యాంకు స్వైపింగ్ మిషన్ ను ఉపయోగించినందుకు బ్యాంకుకు ప్రతి లావాదేవీకి 2 శాతం చార్జీ పే చేయాల్సి ఉంటుంది.
Credit Card Charges : ఆర్బీఐ రూల్ ఏంటో తెలుసా?
ఆర్బీఐ రూల్ ప్రకారం చూసుకుంటే.. పాయింట్ ఆఫ్ సేల్ వద్ద క్రెడిట్ కార్డు కస్టమర్ల నుంచి మర్చంట్స్ 1 శాతం లేదా 2 శాతం అదనపు చార్జీలను తీసుకోకూడదు. మర్చంట్స్ అలా అదనంగా చార్జీలు తీసుకుంటే అది ఖచ్చితంగా ఆర్బీఐ రూల్స్ ను అతిక్రమించినట్టే అవుతుంది. అంతే కాదు.. అటువంటి మర్చంట్స్ కు ఆర్బీఐ పెనాల్టీ వేస్తుంది. అలాంటి మర్చంట్స్ ను బ్లాక్ లిస్టు కూడా చేస్తుంది.
అటువంటి వాళ్లు మళ్లీ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డు స్వైపింగ్ మిషన్ తీసుకునే చాన్స్ ఉండదు. వాళ్లకు మర్చంట్ గా బ్యాంకులు ఖాతాలు తెరవవు. ఒక్కసారి బ్లాక్ లిస్టు అయితే ఇక అంతే. ఒకవేళ మీ దగ్గర అలా అదనపు చార్జీలు తీసుకుంటే మీరు వెంటనే ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. వాళ్లు ఆ మర్చంట్ పై తగిన చర్యలు తీసుకుంటారు. వాళ్లు అదనపు చార్జీలు తీసుకుంటామంటే ఖచ్చితంగా మర్చంట్స్ కు ఆర్బీఐ రూల్ చెప్పండి. అప్పుడు వాళ్లు ఖచ్చితంగా వింటారు.