Fixed Deposits : చాలామంది తమ దగ్గర కొంత డబ్బు ఉంటే వెంటనే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు. లక్ష రూపాయలు ఉన్నా వాటి వల్ల ఎలాంటి అవసరం లేకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఫిక్స్ డ్ చేసేస్తారు. కానీ.. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అసలు ఫిక్స్డ్ డిపాజిట్ కు సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకోకుండా తొందరపడి డిపాజిట్ చేస్తే మాత్రం అడ్డంగా బుక్ అవ్వాల్సి వస్తుంది.
సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక సంవత్సరానికి, లేదా 2 ఏళ్లకు, 3 ఏళ్లకు.. ఇలా సంవత్సరాలు పెంచుకుంటూ పోతారు. అయితే.. కొన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ విషయంలో తేడా ఉంటుంది. ఒకచోట ఫిక్స్డ్ డిపాజిట్ తక్కువ ఉంటే మరో బ్యాంకులో ఎక్కువ ఉంటుంది. ఇలా మారుతూ ఉంటుంది. అదే వడ్డీ సంవత్సరానికి ఒకటి ఉంటుంది. రెండేళ్లకు ఇంకోటి ఉంటుంది. మూడేళ్లకు మరొకటి ఉంటుంది. కొందరు సంవత్సరానికి ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకుంటారు. సంవత్సరం అంటే అది సంవత్సరం కాదు కొందరు 340 రోజులకే ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. కానీ.. ఇక్కడే ఒక తిరకాసు ఉంటుంది. అది కస్టమర్లకు తెలియకుండా బ్యాంకులు చాలా తెలివిగా వ్యవహరిస్తాయి.
Fixed Deposits : అసలు ఎన్నేళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోవాలి?
కొన్ని బ్యాంకులు సంవత్సరానికి ఒక వడ్డీ ఇస్తుంటాయి. సంవత్సరానికి ఒక్క రోజు తగ్గినా కూడా మరో వడ్డీ రేటు ఉంటుంది. అంటే ఉదాహరణకు సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి అని అనుకుంటే.. 365 రోజుల్లో ఒక్క రోజు తగ్గినా 364 రోజులకు ఒక వడ్డీ ఉంటుంది. 365 రోజుల నుంచి 2 ఏళ్లకు మరో వడ్డీ రేటు ఉంటుంది.
365 రోజుల కంటే తక్కువ అంటే 364 రోజులకు ఎఫ్డీ చేస్తే అది 5.75 శాతం ఉంటుంది. అదే 364 కంటే ఎక్కువ రోజుల నుంచి రెండేళ్ల వరకు అయితే వడ్డీ 6.80 గా ఉంటుంది. అంటే.. ఒక్క రోజు తేడా వచ్చినా 1.05 శాతం వడ్డీని కోల్పోవాల్సి ఉంటుంది.
అందుకే ఎఫ్డీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకొని వడ్డీ రేటు ఎక్కువ ఉన్న టెన్యుర్ ను సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఏమాత్రం తొందరపడి తక్కువ టెన్యుర్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్క శాతం వడ్డీని నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఎఫ్డీ చేసేముందు ఆ బ్యాంకు వడ్డీ రేట్లను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఎఫ్డీలో డబ్బును వేయండి. లేకపోతే తక్కువ వడ్డీనే పొందాల్సి ఉంటుంది. మీకు ఎఫ్డీ గురించి తెలియకపోతే తెలిసిన వాళ్లను తీసుకెళ్లండి. లేదా వివరాలు అన్నీ తెలుసుకున్నాకే ఎఫ్డీలో పెట్టుబడి పెట్టండి.