Best App For Photo Editing Photoleap : ఇలాంటి యాప్ ఒక్కటి మీ ఫోన్ లో ఉంటే చాలు.. ఫోటోలతో ఒక ఆట ఆడుకోవచ్చు. అవును.. ఫోటోలను ఎలా అంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. అది ఏ యాప్ అంటే.. ఫోటోలీప్(Photoleap). ఈ యాప్ ద్వారా ఎలాంటి ఫోటోలను అయినా ఎలాగైనా ఎడిట్ చేసుకోవచ్చు. చాలామంది దగ్గర ఫోటోలు ఉంటాయి కానీ.. వాటిని ఎలా ఎడిట్ చేయాలో తెలియదు. అటువంటి వాళ్ల కోసం ఈ యాప్ బెస్ట్ ఆప్షన్. రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ యాప్ పూర్తిగా ఉచితం. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు ఉచితంగా యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే ఇక.. ఎలాంటి ఫోటోలను అయినా అందులో ఆప్షన్ల ద్వారా అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు. అందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. డబుల్ ఎక్స్పోజర్ అనే ఆప్షన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఆప్షన్లను సెలెక్ట్ చేసుకొని కావాల్సిన విధంగా ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు.
Best App For Photo Editing Photoleap : ఇలాంటి అత్యాధునిక ఆప్షన్స్ మరే యాప్ లో ఉండవు
ఈ యాప్ లో ఉండే అత్యాధునిక ఆప్షన్స్ మరే యాప్ లో ఉండవు అని చెప్పుకోవచ్చు. యానిమేటర్ అనే మరో ఆప్షన్ ఉంటుంది. అందులో ఉండే ఎఫెక్ట్స్ బాగుంటాయి. ఏఐ ఎన్హాన్స్, కేటగరైజ్ లాంటి ఆప్షన్స్ తో ఆ ఫోటోకు రకరకాల ఎఫెక్ట్ లను యాడ్ చేసుకోవచ్చు.
మీ ఫోటోలకు కాస్ట్యూమ్స్ యాడ్ చేసుకోవచ్చు. సీన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ లో బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఏఐ ఎన్హాన్స్ తో ఫోటో క్వాలిటీని పెంచుకోవచ్చు.
ఏఐ అన్ క్రాప్, ఏఐ కార్టూన్స్, ఏఐ కాస్ట్యూమ్, ఏఐ పెట్స్ అలాంటి అన్ని ఏఐ ఎడిట్స్ ఆప్షన్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఎలా కావాలంటే అలా ఫోటోను ఎడిట్ చేసుకోవచ్చు.
ఎడిట్ ఆప్షన్ కట్ అవుట్ ఆప్షన్ ద్వారా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ను అయినా సెట్ చేసుకోవచ్చు. మామూలు ఫోటో ఎడిటింగ్ యాప్ కు, ఈ యాప్ కు ఉన్న తేడా ఏంటంటే.. ఇందులో ఉండే ఆప్షన్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేస్తాయి. అంటే.. ఏఐ మీకు నచ్చినట్టుగా మీ ఫోటోను ఎడిట్ చేస్తుంది. అందుకే ఈ యాప్ కు అంత క్రేజ్. మీకు కూడా ఈ యాప్ నచ్చితే వెంటనే ఇన్ స్టాల్ చేసుకొని ఫోటోలతో ఒక ఆట ఆడుకోండి.