BTS 10th Anniversary : బీటీఎస్ పేరు విన్నారా ఎప్పుడైనా? బీటీఎస్ అనేది ఒక కొరియన్ మ్యూజిక్ బ్యాండ్. ఇది పేరుకు కొరియన్ బ్యాండ్ అయినా ఈ బ్యాండ్ కు ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నిజానికి.. కొరియన్ సాంగ్స్, ఆల్బమ్స్ కు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. అందుకే బీటీఎస్ బ్యాండ్ కు అంత క్రేజ్ వచ్చింది. ఈ బ్యాండ్ ఏర్పాటయి జూన్ 13, 2023కు సరిగ్గా పదేళ్లు అయింది. ఈ బ్యాండ్ కే పాప్స్ కు ఫేమస్. కే పాప్స్ కి చాలామంది అభిమానులు ఉంటారు. వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా బీటీఎస్ కొత్త ఆల్బమ్ ను విడుదల చేస్తూ ఉంటుంది. బీటీఎస్ 9వ వార్షికోత్సవ సమయంలోనూ ఓ ఆల్బమ్ ను విడుదల చేయగా అది సంచలనాలను సృష్టించింది.
అందుకే పిల్లల్లో ఈ బ్యాండ్ అంటే అంత క్రేజ్. ముఖ్యంగా స్కూల్ పిల్లలు అయితే ఈ మ్యాజిక్ ఆల్బమ్ అంటే పడి చచ్చిపోతారు. మ్యాప్ ఆఫ్ ది సోల్ అనే బీటీఎస్ ఆల్బమ్ కి కూడా బీభత్సమైన పాపులారిటీ వచ్చింది. బీటీఎస్ అంటే బాంగ్టన్ సోనీయాండన్. 2013లో ఈ బ్యాండ్ ప్రారంభమైంది. ఈ బ్యాండ్ ను కే పాప్ గ్రూప్ అని కూడా అంటారు. యూట్యూబ్ లో ఈ బ్యాండ్ సృష్టించే రికార్డులు బోలెడు. గత 10 ఏళ్ల నుంచి వీళ్ల సరికొత్త మ్యూజిక్, ఆల్బమ్స్ తో ప్రపంచానికి చేరువయ్యారు.
BTS 10th Anniversary : బీటీఎస్ ఆర్మీ సపోర్ట్ వల్లనే నేడు ఈ స్థాయికి
నిజానికి బీటీఎస్ బ్యాండ్ గ్రూప్ కి.. బీటీఎస్ ఆర్మీ సపోర్ట్ వల్లనే నేడు ఈ స్థాయి లభించింది. 10వ వార్షికోత్సవం సందర్భంగా బీటీఎస్ గ్రూప్ తమ ఫ్యాన్స్ కోసం ఒక సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
ఇక.. ఈ కొరియన్ బ్యాండ్ గ్రూప్ లో ఏడుగురు మెంబర్స్ ఉంటారు. వీళ్లంతా కలిసి 2013 లో విడుదల చేసిన తొలి ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. దీంతో వాళ్ల రేంజే మారిపోయింది. అలాగే.. బీటీఎస్ బ్యాండ్ కు బోలెడు అవార్డులు వచ్చాయి. గోల్డెన్ డిస్క్ అవార్డు, సోల్ మ్యూజిక్ అవార్డు, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో మలోన్ మ్యూజిక్ అవార్డు, యూఎస్ బిల్ బోర్డ్ 200 లో ప్లేస్ దక్కడం, ఇలా.. ఏ రకంగా చూసినా బీటీఎస్ బ్యాండ్ కు ఒక్క కొరియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా స్కూల్ పిల్లలు, యూత్ లో బీభత్సమైన క్రేజ్ దక్కించుకోవడంతో ఇక వాళ్లు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.