Govt To Give Upto RS 3000 Per Month To Unemployed Graduates : ఈ దేశంలో నిరుద్యోగం ఎక్కువైన విషయం అందరికీ తెలుసు. వంద మందిలో ఒక్కరు కూడా ఉద్యోగం చేయలేకపోతున్నారు. అలాగే.. ఉద్యోగం చేయడానికి కావాల్సిన రిసోర్సులు కూడా లేవు. అన్ని కంపెనీలు కూడా లేవు. అందులోనూ ప్రతి సంవత్సరం లక్షల కొద్ది గ్రాడ్యుయేట్స్ పాస్ అయి బయటికి వస్తున్నారు. వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అంటే అది అసాధ్యం అనే చెప్పుకోవాలి. కానీ.. అందరూ ఉద్యోగాలే చేయాలనుకుంటే కష్టం కదా. కొందరు వ్యాపారాలు కూడా చేసుకుంటే బాగా సంపాదించుకోవచ్చు. 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. కానీ.. నేటి యూత్ బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. 30 ఏళ్లు దాటినా కూడా ఏదైనా ఉద్యోగం సంపాదించాలనే చూస్తున్నారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుండటం, అందులోనూ వయసు పెరుగుతున్నా ఉద్యోగాలు రాక యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతూ టెన్షన్ తో పాటు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి బెరోజ్‌గారి భట్టా యోజనా స్కీమ్. ఈ స్కీమ్ కింద మన దేశంలో ఉన్న నిరుద్యోగులకు ప్రతి నెల ప్రభుత్వం రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తుంది.
Govt To Give Upto RS 3000 Per Month To Unemployed Graduates : ఈ స్కీమ్ కింద ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. వయసు పరిమితి కనీసం 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు మాత్రమే ఉండాలి. కనీసం డిగ్రీ, ఐటీఐ, డిప్లోమా.. వీటిలో ఏదో ఒక కోర్స్ చేసి ఉండాలి. వీటిలో ఏదో ఒక కోర్స్ పాస్ అయి ఉండాలి. అదే విధంగా మన కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. అలాగే.. కుటుంబంలో ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఈ స్కీమ్ ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఈ స్కీమ్ ను ఉత్తర ప్రదేశ్ బెరోజ్ గారి భట్టా యోజన అనే పేరుతో తీసుకొచ్చారు.
ఇంకా నార్త్ లో కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఈ స్కీమ్ అందుబాటులోకి రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ స్కీమ్ కింద మీకు అర్హత ఉంటే.. ప్రభుత్వం స్కీమ్ ను తీసుకురాగానే తమకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ల వివరాలు చెక్ చేసి ప్రభుత్వం ప్రతి నెల డబ్బులు అకౌంట్ లో వేస్తుంది.