Number Plates : అది ఏ వాహనం అయినా సరే.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్జీ లాంటి ఫ్యుయెల్ తో నడిచే ప్రతి వాహనానికి ఖచ్చితంగా ఒక నెంబర్ ప్లేట్ ఉంటుంది. దాన్ని ప్రభుత్వమే ఇస్తుంది. కాకపోతే ఒక్కో వాహనానికి ఒక్కో రకమైన నెంబర్ ప్లేట్ ఉంటుంది. మేము చెప్పేది నెంబర్ గురించి కాదు.. నెంబర్ ప్లేట్ల గురించి. ఎందుకంటే నెంబర్ ఖచ్చితంగా వేరే ఉంటుంది. ఒక నెంబర్ కు, ఇంకో నెంబర్ కు అస్సలు తేడానే ఉండదు. కానీ.. నెంబర్ ప్లేట్లలోనూ తేడాలు మీరెప్పుడైనా గమనించారా?
మన దేశంలో చాలా రకాల నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. కానీ.. ఇన్ని రకాల నెంబర్ ప్లేట్స్ ఉన్నాయని చాలామందికి తెలియదు. చాలామంది బైక్స్, కార్లు కొనుక్కుంటారు కదా పర్సనల్ గా వాడుకోవడం కోసం. అటువంటి వాహనాలకు ఉండే నెంబర్ ప్లేట్స్ వైట్ గా ఉంటాయి. వాటి మీద ఉండే నెంబర్స్ మాత్రం బ్లాక్ గా ఉంటాయి. ఇక.. ఎల్లో కలర్ బోర్డు ఉండి.. బ్లాక్ కలర్ లో నెంబర్స్ ఉంటే అది కమర్షియల్ వాహనం అనుకోవాలి. అంటే క్యాబ్, ట్యాక్సీ, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు.. ఇలా కమర్షియల్ గా ఉపయోగించే వాటికి ఎల్లో కలర్ బోర్డు ఉంటుంది.
Number Plates : గ్రీన్ ప్లేట్ పైన తెలుపు రంగు నెంబర్స్ ఉంటే?
కొన్ని నెంబర్ ప్లేట్స్ చూస్తే గ్రీన్ కలర్ ప్లేట్ పైన తెలుపు రంగు నెంబర్స్ ఉంటాయి. అంటే అవి ఎలక్ట్రిక్ వాహనాలు అన్నమాట. బైక్ కానీ.. కారు కానీ.. ఇతర పర్సనల్ వాహనాలు ఏవి తీసుకున్నా వాటికి గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ పైన తెలుపు రంగు నెంబర్స్ ఉంటాయి.
ఇక.. గ్రీన్ కలర్ ప్లేట్ పైన ఎల్లో కలర్ నెంబర్స్ ఉంటే.. అవి ఎలక్ట్రిక్ వాహనాలే కానీ.. ప్రైవేటు వాహనాలు కాదు.. పర్సనల్ వాహనాలు కాదు.. కమర్షియల్ అన్నమాట. ఇంకా బ్లాక్ కలర్ ప్లేట్ పైన ఎల్లో కలర్ నెంబర్స్ ఉంటాయి. అలా ఉంటే సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు అన్నమాట.
ఇంకా కొన్ని వాహనాల నెంబర్ ప్లేట్ మీద అప్ వార్డ్ యారో మార్క్ ఉంటుంది. అలా యారో మార్క్ ఉందంటే ఆ వాహనాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఏదో ఒక వాహనం అయి ఉంటుంది. ఇక.. బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ మీద వైట్ కలర్ నెంబర్స్ ఉంటే విదేశాలకు చెందిన వాళ్లు మన దేశంలో ఎంబసీల్లో పని చేస్తుంటే వాళ్లకు మాత్రమే అలాంటి నెంబర్ ప్లేట్ ఇస్తారు.
ఇక.. లాస్ట్ లో పూర్తిగా రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ఉండి.. నెంబర్ ప్లేట్ మధ్యలో మన జాతీయ చిహ్నం ఉంటుంది. అది కేవలం భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు వాడే కార్లకు మాత్రమే ఉంటాయి.