Gold Ornaments : అదేంటి.. అందరూ బంగారు ఆభరణాలను ఎగబడి మరీ కొంటుంటారు. మీరు మాత్రం బంగారం కొనకండి అంటున్నారు.. అంటారా? అవును మీరు చదివింది నిజమే. అస్సలే బంగారు ఆభరణాలు కొనకండి. దాని వల్ల వచ్చే లాభం పక్కన పెట్టండి.. గోల్డ్ కొనడం వల్ల నష్టపోవడమే ఎక్కువ. చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో బంగారం కొంటూ ఉంటారు. ఇప్పుడు బంగారం కొంటే చాలా రోజుల తర్వాత బంగారం ధర పెరుగుతుంది కదా అంటారా? అవును.. మీరు చెప్పేది నిజమే. కానీ లాంగ్ టర్మ్ పెట్టుబడి కోసం బంగారం కొనాల్సిన అవసరం లేదు. అది రాంగ్ చాయిస్.. ఎందుకో తెలుసుకుందాం రండి.
బంగారం కొంటే ఊరికే కాదు. బంగారం కొంటే మేకింగ్ చార్జీలు, వేస్టేజ్ చార్జీలు, జీఎస్టీ చాలా ఉంటాయి. కొందరు స్టోన్స్ కూడా పెట్టించుకుంటారు. అవి కూడా అదనంగా చార్జీలు అవుతాయి. మొత్తానికి ఏదో బంగారం కొనడం కాదు. దాన్ని కొనడం వల్ల అదనపు చార్జీలు భారీగా అవుతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కోసం ప్లాన్ చేసే వాళ్లకు ఈ అదనపు చార్జీలు అదనంగా అవుతాయి కదా. భవిష్యత్తులో ఆ బంగారాన్ని అమ్మితే మీకు మేకింగ్ చార్జీలు రావు.. వేస్టేజ్ చార్జీలు రావు.. జీఎస్టీ తిరిగి రాదు. స్టోన్స్ దేనికీ పనికిరావు.
Gold Ornaments : మరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఏం చేయాలి?
అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారాన్ని సెలెక్ట్ చేసుకోకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ ను సెలెక్ట్ చేసుకోండి. ఆర్బీఐ అందిస్తున్న సెక్యూరిటీస్ ఇది. ప్రభుత్వం నూటికి నూరుశాతం గ్యారెంటీ ఇస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బులు ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెడితే మనకు ఒక బాండ్ పేపర్ ఇస్తారు. ఆ బాండ్ పేపర్ గోల్డ్ తో లింక్ అయి ఉంటుంది.
గోల్డ్ వాల్యూ పెరిగినప్పుడు ఆ బాండ్ వాల్యూ పెరుగుతుంది. దానితో పాటు ప్రభుత్వమే అదనంగా 2.5 శాతం ఫిక్స్ ఇంటరెస్ట్ అందిస్తుంది. అంటే.. గోల్డ్ వాల్యూ పెరిగినప్పుడు బాండ్ వాల్యూ పెరగడంతో పాటు.. సంవత్సరానికి 2.5 శాతం ఫిక్స్ వడ్డీ వస్తుంది. ప్రతి సంవత్సరం ఆ వడ్డీ మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఇందులో మేకింగ్ చార్జీలు ఏం ఉండవు.. వేస్టేజ్ చార్జీలు ఏం ఉండవు. జీఎస్టీ ఏం ఉండదు.
కాకపోతే ఈ స్కీమ్ కాల పరిమితి 8 ఏళ్లు ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత మన డబ్బు మనకు ఇచ్చేస్తారు. ఒకవేళ మధ్యలో డబ్బు కావాలంటే కూడా ఆ బాండ్ ను అమ్మేసుకోవచ్చు. కాకపోతే ఆ సమయంలో గోల్డ్ వాల్యూ ఎంత ఉందో అంతే ఇస్తారు. ఎక్కువ కాలం ఆగితే గోల్డ్ వాల్యూ కూడా ఎక్కువగా పెరిగే చాన్స్ ఉంటుంది కాబట్టి ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఆగితే అంత లాభం వస్తుందన్నమాట.