Google Pay or PhonePe Scam : సార్.. మీ నెంబర్ కు పొరపాటున డబ్బులు పంపించాం. గూగుల్ పే లో లేదా ఫోన్ పేలో మీకు పొరపాటున పంపించాం. నిజానికి అది వేరే నెంబర్ కు పంపించాలి కానీ.. పొరపాటున మీ నెంబర్ కు డబ్బులు వచ్చాయి. దయచేసి ఆ డబ్బులను తిరిగి పంపించరా.. అని మీకు ఎవరైనా కాల్ చేశారా? అయితే.. అది ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ పనే. అది గూగుల్ పే లేదా ఫోన్ పే స్కామ్ అయి ఉండవచ్చు. మీరు అయ్యో పాపం.. అని అనుకున్నారంటే మీ అకౌంట్ మొత్తం గుల్ల అవుతుంది. ఎందుకో తెలుసుకుందాం రండి.
నిజానికి కొందరు పొరపాటున వేరే నెంబర్ కు పంపిస్తారు. అది ఓకే. ఎందుకంటే.. ఒక్కోసారి నెంబర్స్ మిస్టేక్ లో ఒకరికి పంపించబోయి మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అది ఓకే.. అటువంటి వాళ్లకు తిరిగి పంపించవచ్చు. పొరపాటున పంపించిన వాళ్లకు తిరిగి పంపిస్తే అందులో వచ్చిన సమస్యేం లేదు. కానీ.. ఎవరో తెలియని వాళ్లు మీకు డబ్బులు పంపించి.. తిరిగి కాల్ చేసి ఆ డబ్బులను రిక్వెస్ట్ చేస్తే, వాళ్లు స్కామర్స్ అయి ఉండొచ్చు. కొందరు స్కామర్స్ కావాలని ఒకరిని టార్గెట్ చేసి వాళ్ల గూగుల్ పే లేదా ఫోన్ పే అకౌంట్ కు డబ్బులు వేసి ఆ తర్వాత ఆ డబ్బులను తిరిగి పంపించాలని వేడుకుంటారు.
Google Pay or PhonePe Scam : వాళ్లు పంపించేది కూడా స్మాల్ అమౌంటే?
స్కామర్స్ ఏం చేస్తారంటే.. మీ అకౌంట్ కి, మీ ఫోన్ పే లేదా గూగుల్ పే నెంబర్ కు కావాలని రూ.1000 లేదా రూ.500 లేదా, కనీసం ఒక వంద అయినా పంపించి.. మిస్టేక్ లో మీ నెంబర్ కు పంపించాం. తిరిగి పంపించండి అంటారు. అటువంటి వాళ్లను అస్సలు నమ్మకండి.
మీరు పోనీలే పాపం అని అనుకొని వాళ్ల నెంబర్ కు తిరిగి డబ్బులు పంపించబోతుంటే వాళ్లు ఏం చేస్తారంటే మీ డిటెయిల్స్ అన్నీ వాళ్లు నొక్కేస్తారు. మీరు వాళ్లకు డబ్బులు పంపిస్తున్న సమయంలో మీరు ఉపయోగించే వివరాలన్నీ వాళ్లు తస్కరిస్తారు. మీ యూపీఐ పిన్ తో సహా వాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. అంతే.. మీరు వాళ్లకు డబ్బులు పంపించిన క్షణాల్లోనే మీ అకౌంట్ నుంచి డబ్బులు మొత్తం ఖాళీ అవుతాయి. అందుకే.. అన్ నోన్ నెంబర్స్ నుంచి ఎవరైనా డబ్బులు పంపించి మళ్లీ తిరిగి పంపించాలంటే అస్సలు పంపించకండి.