Bribe : ఈరోజుల్లో ఏ పని చేయాలన్నా లంచం. చిన్న సర్టిఫికెట్ కావాలన్నా లంచం. చివరకు డెత్ సర్టిఫికెట్ కి కూడా లంచం. అన్నీ లంచాలు, లంచాలు. అసలు లంచం లేకుండా ఏ పని జరగడం లేదు మన దేశంలో లంచం అనేది చాప కింద నీరులా విస్తరిస్తోంది. లంచాన్ని నిర్మూలించడం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. సపరేట్ డిపార్ట్ మెంట్ పని చేస్తోంది. అయినా కూడా లంచాలు ఇచ్చేవాళ్లు తగ్గడం లేదు.. తీసుకునే వాళ్లు కూడా తగ్గడం లేదు. అసలు లంచం తీసుకోవడం కాదు.. ఇవ్వడం కూడా నేరమే. లంచం ఇచ్చిన వాళ్లు కూడా నేరం చేసినట్టే. అందుకే లంచం ఎవ్వరికీ ఇవ్వకూడదు. రూపాయి కూడడా ఇవ్వకూడదు అని ప్రభుత్వం చెబుతుంటుంది.
ఎక్కువగా లంచాలు తీసుకునేది ఎమ్మార్వో ఆఫీసుల్లో, ఇంకా పోలీస్ స్టేషన్లలో. చిన్న పని కోసం పోయినా కూడా చేయి తడపాల్సిందే. లంచం ఇవ్వకపోతే నెలలకు నెలలు, సంవత్సరాలకు సంవత్సరాలు తిప్పించుకుంటారు. కొందరు ఆఫీసర్లు అయితే నేరుగా లంచం ఇవ్వు అంటూ అడగరు. ఇన్ డైరెక్ట్ గా లంచం అడుగుతారు. లేదా ఇన్ డైరెక్ట్ గా లంచం ఇస్తేనే పని జరుగుతుంది అన్నట్టుగా ప్రవర్తిస్తారు. చుట్టూ తిప్పించుకుంటారు. అందుకే ఎవ్వరు లంచం అడిగినా కూడా రూపాయి కూడా ఇవ్వకండి. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడమే వాళ్ల పనులు చేయడమే వాళ్ల డ్యూటీ.
Bribe : లంచం అడిగితే వాళ్ల మీద ఫిర్యాదు చేయండి
వాళ్లు లంచం అడిగితే వాళ్ల మీద ఫిర్యాదు చేయొచ్చు. వాళ్లు లంచం అడిగితే 1064 నెంబర్ కు ఫోన్ చేసి ఫలానా ఆఫీసర్ మీద ఫిర్యాదు చేయొచ్చు. లేదా యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ) అంటారు. అందులో కూడా వాళ్ల మీద ఫిర్యాదు చేయొచ్చు.
అయితే.. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్లు మిమ్మల్ని లంచం అడిగారు అని ప్రూఫ్ మీ దగ్గర ఉండాలి. లేకపోతే వాళ్లే రివర్స్ లో మీ మీద కేసు పెట్టే చాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిని బదనాం చేస్తున్నాడంటూ కేసు ఫైల్ చేస్తారు.
అందుకే.. వాళ్లు మిమ్మల్ని లంచం అడిగారు అనడానికి కాల్ రికార్డింగ్ లేదా వీడియో రికార్డింగ్, ఫోటోలు ఏవో ఒక సాక్ష్యాన్ని చూపించాల్సి ఉంటుంది. అధికారులకు ఫిర్యాదు చేసేముందు ఏవో ఒక ప్రూఫ్ చూపించండి. లేదా.. వాళ్లను ఫాలో చేసి అతడికి లంచం ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేలా చేయండి. అప్పుడే ఆ అధికారిపై ఏసీబీ అధికారులు సరైన చర్యలు తీసుకోగలుగుతారు.