Shaking Legs : ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ.. దాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. మంచం మీద కూర్చొని, కుర్చీల మీద కూర్చొని చాలా మంది కాళ్లు ఊపుతుంటారు. దాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ.. కొన్ని పెద్దలు చెప్పిన విషయాలను మనం నమ్మాలి. వెనకటికి ఎలా ఉండేవాళ్లే వాళ్లను చూసి నేర్చుకోవాలి. వాళ్లు చెప్పే ప్రతి విషయం వెనుక సైన్స్ ఉంటుంది. దాన్ని విస్మరిస్తే చాలా సమస్యలు వస్తాయి. అందులో ఒకటి మంచం మీద కూర్చొని కాళ్లను ఊపడం.
మంచం మీద కానీ.. కుర్చీ మీద కానీ.. ఏదైనా ఎత్తుల మీద కాని కూర్చొని కాళ్లు ఊపితే అరిష్టం అంటారు. ఆ అరిష్టం కాళ్లు ఊపిన వాళ్లకే కాదు.. ఏ ఇంట్లో అయితే మంచం మీద కూర్చొని కాళ్లు ఊపుతారో.. ఆ ఇంటి వాళ్లకు దరిద్రం పట్టుకుంటుంది. వాళ్లు ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు.
Shaking Legs : ప్రతి పనిలో నష్టాలే
మంచం మీద కూర్చొని కాళ్లు ఊపడం ఎంత దరిద్రం అంటే.. ఏ పని చేసినా కలిసి రాదు. ప్రతి దాంట్లో నష్టమే వస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. ఇది కేవలం పెద్దలు చెప్పిన ఈ కోణం. కానీ.. ఇందులో మరో కోణం కూడా ఉంది. అదేంటంటే.. మంచం మీద కూర్చొని కాళ్లు ఊపితే.. నరాల్లో బలహీనత వస్తుంది. నరాలు వీక్ అవుతాయి. దాని వల్ల నడవడం ఇబ్బందిగా మారుతుంది. ఒక్కోసారి ఆ నరాల బలహీనత వల్ల వీర్యం కూడా అవుట్ అవుతుందట. దాని వల్ల ఆ సమస్యలు కూడా పెరుగుతాయట. అందుకే.. మంచం మీద కూర్చొని కాళ్లు ఊపకూడదు అని పెద్దలు చెబుతుంటారు. దాని వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందని చాలామందికి తెలియదు.