AC : ఏసీ లేకుంటే ఈ రోజుల్లో బతకడం కష్టమే. ఎందుకంటే.. ఇదంతా కాంక్రీట్ జంగల్. ఇంట్లో ఉక్కపోతను భరించలేం. కాస్త ఎండ కొడితే చాలు.. వేడి భయంకరంగా ఉంటుంది. అందుకే చాలామంది ఇంట్లో ఏసీ పెట్టించుకుంటారు. ఇంట్లో ఏసీ ఉంటే ఇక అది 24 గంటలు నడవాల్సిందే. ఏసీ ఒక్కసారి అలవాటు అయితే చాలు. ఇక ఎప్పుడూ ఏసీ ఉండాల్సిందే. ఏసీ లేకుంటే అస్సలు ఉండలేరు. ఏసీకి అలవాటు పడితే బయటికి వెళ్లి ఎండలో ఎక్కువ సేపు ఉండలేరు. కానీ.. అసలు ఏసీ ఎక్కువ సేపు వాడొచ్చా? ఏసీలో ఎక్కువ సేపు ఉంటే ప్రమాదమా? ఎంత వరకు ఏసీ మాత్రమే వాడాలి.. అనే విషయాలు తెలుసుకుందాం రండి.
చాలామంది ఏసీ అంటే మంచిది అనుకుంటారు. కానీ.. ఏసీ అనేది అస్సలు మంచిది కాదు. అది చాలా డేంజర్. అది వాడటం వల్ల ఆరోగ్యానికి నష్టాలు తప్పితే లాభాలు ఏం లేవు. 24 గంటలు ఏసీలోనే ఉండేవారికి సైనటైసిస్, అలెర్జీ, లంగ్ ఇన్‌ఫెక్షన్ లాంటి వ్యాధులు వస్తాయి. చాలామంది ఏసీని 16 డిగ్రీలకు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఏసీని బాగా తగ్గిస్తుంటారు. కానీ.. ఏసీని 24 డిగ్రీల కంటే తక్కువ చేసి వాడితే ఏమౌతుందో తెలుసా? చాలా సేపు అలా 24 డిగ్రీల కంటే తక్కువ ఏసీ వాడితే.. మైగ్రేన్, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.
AC : అసలు ఏసీ ఎంత డిగ్రీలు వాడాలి?
ఏసీ అనేది ఆర్టిఫిషియల్ ఎయిర్. స్వచ్ఛమైన గాలి కాదు అది. స్వచ్ఛమైన గాలిని ఫిల్టర్ చేసి చల్లని గాలిని ఇస్తుంది. కానీ.. అది చర్మం మీద పడటం వల్ల తక్కువ వయసులోనే చర్మంపై ముడతలు పడతాయి. త్వరగా వయసు మీదపడినట్టుగా చర్మం ముడతలు పడిపోతుంది. ఎక్కువ సేపు ఏసీలో ఉంటే తక్కువ ఏజ్ లోనే ఎక్కువ వయసు వారిలా కనిపిస్తారు. అంటే త్వరగా ముసలితనం వచ్చేస్తుంది అన్నమాట.
అందుకే ఏసీని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. ఇంట్లో ఏసీ ఉంది కదా అని 24 గంటలు ఏసీ వేసుకొని కూర్చొంటే మాత్రం భవిష్యత్తులో అది మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. త్వరగా చర్మం ముడతలు పడుతుంది. తలనొప్పి, అలెర్జీ, ఇన్ ఫెక్షన్లు చాలా వస్తాయి. సాధ్యమైనంత మేరకు ఏసీ వాడకాన్ని తగ్గించి కుదిరితే ఫ్యాన్ ఉంటే ఆ గాలితో అడ్జస్ట్ అవ్వండి. ఒకవేళ ఏసీ వేసుకున్నా కూడా తక్కువ ఉష్ణోగ్రత అస్సలు పెట్టకండి. 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ సేపు వాడకండి.