Banks No Due Certificate : చాలామంది బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుంటూ ఉంటారు. లోన్స్ తీసుకున్న తర్వాత వాటిని ఈఎంఐ రూపంలో లేదంటే ఒకేసారి సెటిల్ మెంట్ చేసుకుంటూ ఉంటారు. అలా లోన్స్ క్లియర్ చేసుకుంటారు. లోన్స్ క్లియర్ చేసుకున్న తర్వాత చాలామంది ఇక దాని గురించే మరిచిపోతారు. లోన్ క్లియర్ అయింది కదా.. ఇక ఆ బ్యాంకుతో ఏం పని అని అనుకుంటారు. లోన్ అయితే క్లియర్ అవుతుంది కానీ.. అసలు లోన్ క్లియర్ అయిందని ప్రూఫ్ ఏంటి. ఎవరైనా అడిగితే ఏ ప్రూఫ్ చూపించాలి.
దానికోసం ఉన్నదే నో డ్యూ సర్టిఫికెట్, లేదా నో అబ్జెక్సన్ సర్టిఫికెట్(ఎన్వోసీ). వీటిని ఖచ్చితంగా లోన్ క్లోజ్ చేయగానే తీసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు పర్సనల్ లోన్ క్లియర్ చేస్తే దానికి సంబంధించి ఒక క్లియర్ ప్రూఫ్ ఉండాలి. దాన్ని బ్యాంకు వాళ్ల దగ్గర్నుంచే తీసుకోవాలి. బ్యాంకు వాళ్లు ఇవ్వకున్నా మనమే వాళ్లకి రిక్వెస్ట్ పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది.
Banks No Due Certificate : ఆ సర్టిఫికెట్ తీసుకుంటే కలిగే లాభాలు ఏంటి?
మీ పర్సనల్ లోన్ కావచ్చు, మరేదైనా లోన్ కావచ్చు. అది క్లియర్ కాగానే తమకు నో డ్యూ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని బ్యాంకు వాళ్లను అడగాల్సి ఉంటుంది. అందులో క్లియర్ గా బ్యాంకు వాళ్లు మెన్షన్ చేస్తారు. అది ఉంటే.. భవిష్యత్తులో ఆ లోన్ కు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని చూపించవచ్చు. భవిష్యత్తులో ఏవైనా లోన్స్ కావాలన్నా కూడా ఆ నో డ్యూ సర్టిఫికెట్ ఉండాలి. మీరు బ్యాంకు లోన్ కట్టినా కూడా ఒక్కోసారి క్రెడిట్ స్కోర్ పెరగదు. అందులో లోన్ క్లియర్ కానట్టుగా చూపిస్తుంది. అటువంటప్పుడు మీకు నో డ్యూ ఉంటే.. అప్పుడు క్రెడిట్ స్కోర్ లో అప్ డేట్ అయి క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
భవిష్యత్తులో మీరు లోన్ కట్టలేదంటూ మీ ఇంటికి లీగల్ నోటీసులు వచ్చే చాన్స్ కూడా ఉంది. మీరు కట్టినా కూడా లోన్ క్లియర్ చేసినా కూడా మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకపోవడం వల్ల.. మీకు లీగల్ నోటీసులు వస్తే వాటికి ఎలా సమాధానం చెప్పాలో మీకు తెలియదు. అదే.. మీ దగ్గర నో డ్యూ సర్టిఫికెట్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీకు ఎలాంటి లీగల్ నోటీసులు వచ్చినా పెద్ద సమస్య ఉండదు. మీ దగ్గర నో డ్యూ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు చూపించి లీగల్ సమస్యలను తప్పించుకోవచ్చు.