Human Being Soul Weight : ఆత్మ అంటే తెలుసు కదా. ప్రతి మనిషికి పుట్టడం ఎలాగో చావు కూడా అంతే. మనిషి పుట్టుక, చావు ఈ రెండు మన చేతుల్లో ఉండవు. ఆ దేవుడి చేతుల్లో ఉంటాయి. ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మే మనిషిని నడిపిస్తుంటుంది. మనిషి ఎప్పుడైతే చచ్చిపోతాడో అప్పుడే ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలేస్తుంది. వేరే శరీరాన్ని వెతుక్కుంటుంది. వేరే జన్మ ఉంటుంది. లేదంటే ఆ ఆత్మ పరమాత్మలో లీనం అవుతుంది.
ఇవన్నీ మన పురాణాలు చెప్పినవే. పురాణాలు, పుస్తకాల్లో రాసిన వాటిని మనం చదువుకొని ఆత్మ ఉంటుందని నమ్ముతున్నాం. అయితే.. ఆత్మ ఉంటుందని పురాణాల్లో చదవడం కాదు.. నిజంగానే మనిషికి ఆత్మ ఉంటుందట. ఓ వ్యక్తి మనిషికి ఆత్మ ఉంటుందని నిరూపించాడు కూడా. అమెరికాలో ఓ సైంటిస్టు ఈ ప్రయోగం చేశాడు. మనిషి ఆత్మ ఎంతో కూడా చెప్పేశాడు.
Human Being Soul Weight : మనిషి ఆత్మ బరువు ఎన్ని గ్రాములో తెలుసా?
మనిషి ఆత్మ బరువు కేవలం 21 గ్రాములే నట. అవును.. అది సైంటిఫికల్ గా నిరూపితం కూడా అయింది. 1907 లో మెక్ డగెల్ అనే ఓ డాక్టర్, సైంటిస్టు.. ఓ వ్యక్తిపై ప్రయోగం చేశాడు. మరణం అంచున ఉన్న ఓ వ్యక్తిని పడుకో బెట్టి అతడికి బరువును కొలిచే పరికరాన్ని అమర్చాడు. అతడు చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత బరువును చెక్ చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి బరువు 21 గ్రాములు తగ్గిందట.
అంటే.. మనిషి చనిపోగానే.. ఆత్మ శరీరంలో నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి ఆ ఆత్మ బయటికి వచ్చేయడం వల్ల బరువు తగ్గాడు. 21 గ్రాములు తగ్గాడంటే మనిషి బరువు 21 గ్రాములే ఉంటుందన్నమాట. అయితే.. ఇది నిజం కాదు అంటూ కొందరు నిపుణులు అతడి ప్రయోగాన్ని కొట్టిపారేశారు. ఎందుకంటే.. మనిషి చనిపోయాక అతడి శ్వాసక్రియ ఆగిపోయి, గుండె, ఊపిరితిత్తులు పనిచేయవని, అన్నీ ఆగిపోవడం వల్ల కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తాడు తప్పితే ఆత్మ, గీత్మ అంతా ట్రాష్ అంటూ కొట్టిపారేశారు.
దీంతో ఆయన మరోసారి కుక్కల మీద ప్రయోగం చేశాడు. 15 కుక్కల మీద చేశాడు. కానీ.. అవి చనిపోకముందు, చనిపోయాక పెద్దగా వాటి బరువులో తేడా కనిపించలేదట. అంటే ఆత్మ అనేది కేవలం మనుషులకే ఉంటుంది కాబట్టి మనిషి చనిపోయాక బరువు తగ్గారు. జంతువులకు ఆత్మ ఉండదు కాబట్టి అవి చనిపోయినా బరువు తగ్గలేదు అంటూ ఆయన నిరూపించాడు. జీవక్రియ ఆగిపోతే మనిషి బరువు ఒక గ్రాము తగ్గుతుంది కానీ.. 21 గ్రాములు తగ్గదు అంటూ కొత్త వాదనను తెరమీదికి తీసుకొచ్చాడు.