Stickers On Fruits : మీరు ఎప్పుడైనా ఫ్రూట్స్ కొన్నారా? రోడ్ల పక్కన, షాపుల్లో పండ్లను అయితే అమ్ముతుంటారు. అయితే.. చాలామంది గమనించారో లేదో కానీ.. పండ్ల మీద కొన్ని స్టిక్కర్లు ఉంటాయి. అన్ని పండ్ల మీద ఉండవు కానీ.. కొన్ని పండ్ల మీద మాత్రం స్టిక్కర్లు ఉంటాయి. అసలు ఆ స్టిక్కర్లకు అర్థం ఏంటి. పండ్ల మీద ఉండే స్టిక్కర్ల వల్ల ఉపయోగం ఏంటి. స్టిక్కర్లు ఉన్న పండ్లు తినాలా వద్దా.. అసలు ఏంటి ఆ స్టిక్కర్ల గోల అనేది తెలుసుకుందాం రండి.
చాలామందికి ఏమనుకుంటారంటే.. పండ్ల మీద స్టిక్కర్లు ఉంటే అవి ఎక్కువ ధర ఉంటాయని, అలాగే వాటి నాణ్యత కూడా బాగుంటుందని అనుకుంటారు. ఇంపోర్టెడ్ అని అనుకుంటాం. కానీ.. అసలు పండ్ల మీద స్టిక్కర్లకు, ధరకు సంబంధమే ఉండదు. ఎందుకంటే.. పండ్ల మీద ఉండే స్టిక్కర్లకు పెద్ద కథే ఉంది. నిజానికి పండ్ల మీద ఎక్కువగా మూడు రకాల స్టిక్కర్లను వాడుతుంటారు. ఆ స్టిక్కర్ల మీద నెంబర్స్ ఉంటాయి. అలాగే ఒక బార్ కోడ్ కూడా ఉంటుంది. ఆ బార్ కోడ్, నెంబర్స్ ఆధారంగా ఆ పండు గురించి చెప్పేయొచ్చు అన్నమాట.
Stickers On Fruits : ఆ నెంబర్స్ ఎందుకు ఇస్తారు? బార్ కోడ్ వల్ల ఏంటి ఉపయోగం?
ఆ స్టిక్కర్ మీద ఉండే బార్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ పండు ఎక్కడ పండింది. ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడికి ఇంపోర్ట్ అయింది.. అనే వివరాలు అన్నీ ఉంటాయి. ఇక.. ఆ పండు మీద 5 డిజిట్స్ ఉన్న నెంబర్ ఉంటే.. అది కూడా 9 తో నెంబర్ స్టార్ట్ అయితే మాత్రం ఆ పండు నాచురల్ గా అంటే సహజసిద్ధంగా పండిన పండు అని భావించాలి.
ఒకవేళ ఆ పండు మీద ఉన్న నెంబర్ 4 తో స్టార్ట్ అయితే.. 4 అంకెలు మాత్రమే ఉంటే అది రసాయనాలతో పండింది అని అర్థం చేసుకోవాలి. అంటే.. నాచురల్ గా పండింది కాదు కానీ కెమికల్స్ తో పండింది అని భావించాలి. ఇక ఆ పండు 8 అనే నెంబర్ తో స్టార్ట్ అయితే 5 నెంబర్లే ఉంటే అది జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రాడక్ట్ అని భావించాలి.
అందుకే ఇంకోసారి ఫ్రూట్ షాప్ నకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్రూట్ మీద ఉన్న స్టిక్కర్ ను మాత్రం చెక్ చేయండి. నాచురల్ గా పండినవే కావాలంటే పైన చెప్పిన విధంగా నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకోండి. అసలు ఫ్రూట్స్ మీద ఎందుకు స్టిక్కర్స్ వేస్తారో ఇప్పుడు అర్థం అయిందా?