Currency Notes : కరెన్సీ నోట్లను ప్రభుత్వాలు అప్పుడప్పుడు మార్చుతూ ఉంటాయి. ఫేక్ నోట్ల చలామణి వచ్చినప్పుడు ఆ నోట్ల బదులు వేరే డిజైన్ తో నోట్లను ప్రింట్ చేస్తుంటారు. అయితే.. మన దేశంలో కొన్నేళ్ల కిందనే కొత్త నోట్లు వచ్చాయి. అంతకుముందు ఉన్న 100, 500, 1000 నోట్లను ప్రభుత్వం బ్యాన్ చేసి.. కొత్తగా 10, 20, 50, 100, 200, 500, 2000 నోట్లను తీసుకొచ్చింది. ఆ నోట్లు అన్నీ రకరకాల డిజైన్ లతో తయారవుతున్నాయి. అయితే.. అన్ని నోట్లలో ఒక కామన్ డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ఏంటో చాలామందికి తెలియదు.
దానికి కారణం.. మనం కరెన్సీ నోట్లను ఎప్పుడూ పరీక్షించి చూడం. ఎవరైనా ఇచ్చినా, ఏటీఎంలో తీసుకున్నా పెద్దగా వాటిని పరీక్షించి చూడం. అవసరం ఉన్న చోట వాటిని ఇచ్చేస్తుంటాం. కానీ.. ఒకసారి మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లను చూడండి. అప్పుడు అర్థం అవుతుంది. దాని డిజైన్ ఎలా ఉందో.. ఎందుకు అలా డిజైన్ చేశారో అర్థం అవుతుంది. నిజానికి నకిలీ నోట్లను అరికట్టేందుకు కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను కరెన్సీ నోట్ల మీద యాడ్ చేస్తుంటారు. దాని వల్ల అసలు నోటు ఏది.. నకిలీ నోటు ఏది అని తెలుసుకోవచ్చు.
Currency Notes : 100, 500, 2000 నోట్ల మీద ఉన్న నల్ల గీతలను ఎప్పుడైనా చూశారా?
తాజాగా ఆర్బీఐ రిలీజ్ చేస్తున్న 100, 500, 2000 నోట్ల మీద నల్ల గీతలు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి. వాటిని ఎందుకు పెట్టారో తెలుసా? నోటు వాల్యూను బట్టి ఆ గీతలు ఉంటాయి. 100 రూపాయల నోటు మీద నాలుగు గీతలు ఉంటాయి. 200 నోటు మీద ముందు రెండు గీతలు ఆ తర్వాత రెండు సున్నాలు ఆ తర్వాత రెండు గీతలు ఉంటాయి. అదే 500 నోటు మీద ఐదు గీతలు ఉంటాయి.
2000 నోటు మీద ఏడు గీతలు ఉంటాయి. అసలు ఈ గీతలు మన కోసం కాదు.. సెక్యూరిటీ ఫీచర్ అంతకన్నా కాదు. అవి అంధుల కోసం. అవును.. కళ్లు కనిపించని వాళ్లు కరెన్సీ నోట్లను గుర్తించలేరు కదా. అది ఏ నోటో వాళ్లకు తెలియదు. కానీ.. అంధుల కోడ్ లో ఉన్న ఆ నల్ల గీతల ద్వారా వాళ్లు ఆ నోట్లను గుర్తిస్తారన్నమాట. అలా.. వాళ్లు మార్కెట్ లో కళ్లు కనిపించకున్నా.. నోటును పట్టుకొని అది ఏ నోటో చెప్పేయగలరు.