How To Exchange Your Old Clothes and Get New Clothes : అసలే ఇది దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్. పండుగ సీజన్ లో చాలామంది షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. అందులోనూ ఎక్కువగా కొత్త బట్టలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అందులో భాగంగానే చాలామంది షాపింగ్ మాల్స్ లోనే తిరుగుతూ ఉంటారు. పండుగ సమయంలో కొత్త బట్టలు వేసుకోవాలి కదా మరి. చాలామంది కొత్త బట్టలు తీసుకోగానే పాత బట్టలను పక్కన పడేస్తారు. అవి మంచిగానే ఉన్నా కూడా వాటిని వేసుకోవడానికి ఇష్టపడరు. పక్కన పడేస్తారు. లేకపోతే డస్ట్ బిన్ లో వేస్తారు. కానీ.. ఇక నుంచి మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీ దగ్గర ఉన్న పాత బట్టలను తీసుకొస్తే ఈ షాపింగ్ మాల్ లో కొత్త బట్టలు ఇస్తారు. పాత బట్టలు ఇస్తే కొత్త బట్టలు ఇస్తారా? ఎక్కడ.. ఎలా అని అంటున్నారా? పదండి తెలుసుకుందాం.
మీ దగ్గర పాత బట్టలు చాలా ఉంటే.. వాటిని ఒక బ్యాగ్ లో పెట్టుకోండి. ఆ బ్యాగ్ ను తీసుకొని హెచ్ అండ్ ఎమ్ అనే మాల్ కు వెళ్లండి. అందులోనే మీకు పాత బట్టలు తీసుకొని కొత్త బట్టలు ఇస్తారు. అసలు పాత బట్టలు తీసుకొని వాళ్లేం చేసుకుంటారు అంటారా? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పాత బట్టలు అంటే.. అవి చూడటానికి నీట్ గా ఉండాలి. వాటిని పిండి, నీట్ గా మడతపెట్టి తీసుకురావాలి. చిరిగిపోయి ఉండకూడదు. వాటిని తీసుకొని మీకు డిస్కౌంట్ కూపన్స్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ కూపన్స్ ఉపయోగించి మీరు అందులో షాపింగ్ చేసిన డ్రెస్సులకు 10 శాతం, 15 శాతం డిస్కౌంట్ వరకు అందిస్తారు.
How To Exchange Your Old Clothes and Get New Clothes : చెకిన్ కౌంటర్ వద్ద బట్టలు వాళ్లకు ఇవ్వాలి
చెకిన్ కౌంటర్ వద్దకు వెళ్లి వాళ్లకు బట్టలు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లు అన్నీ చెక్ చేసుకొని బట్టల క్వాలిటీని బట్టి డిస్కౌంట్ కూపన్స్ ఇస్తారు. ఏ బ్రాండ్ అయినా సరే.. బట్టల క్వాలిటీని బట్టి కూపన్స్ ఇస్తారు. ఎంత బిల్ అయితే.. దానిలో 15 శాతం, 10 శాతం డిస్కౌంట్ ఇస్తారు. అలాగే.. మీరు తొలిసారి హెచ్ అండ్ ఎమ్ స్టోర్ కు వెళ్తే వెల్ కమ్ బోనస్ కింద 10 శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఇలా.. మొత్తం 25 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీకు నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవచ్చు. స్టూడెంట్స్ కి సపపేట్ గా కొంత డిస్కౌంట్ అందిస్తున్నారు.