Birthday Shopping : చాలామంది పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం షాపింగ్ చేస్తుంటారు. షాపింగ్ అనేది అందరూ చేసేదే. కానీ.. బర్త్ డే లాంటి వేడుకలు చేసుకోవడం కోసం చేసే షాపింగ్ వేరు. పండుగలకు, పబ్బాలకు షాపింగ్ చేసినా చేయకున్నా.. బర్త్ డేకి మాత్రం ఖచ్చితంగా షాపింగ్ అయితే చేస్తారు జనాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బర్త్ డే అనేది స్పెషల్ కాబట్టి. అయితే.. బర్త్ డే సందర్భంగా బర్త్ డే స్పెషల్ డిస్కౌంట్ షాపింగ్ లో లభిస్తే ఎలా ఉంటది. ఎగిరి గంతేయాలనిపిస్తుంది కదా. మరి.. అలాంటి స్పెషల్ డిస్కౌంట్లు ఇచ్చే షోరూమ్స్ కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి. ఉన్నాయి.. వాటి వివరాలు తెలుసుకుందాం రండి.
బర్త్ డే నెలలో కొన్ని బ్రాండ్స్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అంటే ఎవరైతే బర్త్ డే చేసుకుంటూ ఉంటారో వాళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని బ్రాండ్స్ డిస్కౌంట్లను అందిస్తుంటాయి. ఆయా బ్రాండ్స్ మీద 25 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తుంటాయి. కాకపోతే అన్ని బ్రాండ్స్ కావు. కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఈ డిస్కౌంట్ ను ఇస్తాయి. అంటే.. మీ బర్త్ డే ఎప్పుడో ఆ నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
Birthday Shopping : బర్త్ డే ఆఫర్స్ ఇచ్చే బ్రాండ్స్ ఏంటి?
బర్త్ డే ఆఫర్స్ ఇచ్చే బ్రాండ్స్ అన్నీ పెద్దవే. ఉదాహరణకు వెస్ట్ సైడ్ అనే బ్రాండ్ బర్త్ డే ఆఫర్ కింద 5000 వరకు వాళ్ల స్టోర్ లో షాపింగ్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే.. హెచ్ అండ్ ఎమ్ అనే బ్రాండ్ కూడా బర్త్ డే ఆఫర్స్ ను అందిస్తుంది.
బర్త్ డే నెలలో హెచ్ అండ్ ఎమ్ స్టోర్ లో షాపింగ్ చేస్తే ఏదైనా ఒక ఐటెమ్ పైన 25 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. ఇక టాటా కంపెనీలకు చెందిన తనిష్క్ కానీ.. వరల్డ్ ఆఫ్ టైటాన్ కానీ టైటాన్ ఐ ప్లస్, ఫాస్ట్ ట్రాక్, హీలియోస్.. ఇలా టాటా బ్రాండ్స్ కి చెందిన ఏ ప్రాడక్ట్ తీసుకున్నా బర్త్ డే నెలలో స్పెషల్ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తుంటారు. కాకపోతే బర్త్ డేకి నెల రోజుల ముందే వాళ్ల బ్రాండ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడే ఆ ఆఫర్ వర్తిస్తుంది. మీ బర్త్ డే ఏ నెలలో ఉంది. మీ బర్త్ డే నెలలో షాపింగ్ చేయాలనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే భారీ డిస్కౌంట్లతో షాపింగ్ చేసేయండి.