Sukanya Samriddhi Yojana Central Govt Scheme : మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? అయితే ఆడపిల్ల తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం రూ.67 లక్షలు ఇస్తుంది. అలా ఎలా అంటారా? పదండి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే పాప చదువు కోసం, పెళ్లి కోసం ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. కానీ.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో క్లారిటీగా తెలియదు. దాని కోసమే.. ఆడపిల్లల భవిష్యత్తు కోసమే కేంద్ర ప్రభుత్వం బెస్ట్ స్కీమ్ ను తీసుకొచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.
ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే ఆడపిల్ల ఎదిగి చదువు పూర్తయి పెళ్లి ఈడుకు వచ్చే సరికి ప్రభుత్వమే తిరిగి రూ.67 లక్షల వరకు చెల్లిస్తుంది. ఇది ఒక ప్రభుత్వ స్కీమ్. మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఆ పాప పేరు మీద ఈ స్కీమ్ కింద ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కనీసం రూ.250 కట్టి కూడా ఈ అకౌంట్ ను ఓపెన్ చేయొచ్చు. ఆడపిల్లకు 10 ఏళ్లు వచ్చే వరకు ఆ స్కీమ్ కింద ఖాతా తెరవచ్చు. పాప తల్లిదండ్రులు కానీ.. గార్డియన్ కానీ ఈ స్కీమ్ కింద ఖాతా తీసుకోవచ్చు.
Sukanya Samriddhi Yojana Central Govt Scheme : పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ స్కీమ్ కింద పోస్టాఫీసు లేదా బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి కనీసం రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద 8 శాతం వడ్డీ రేటు ఉంది. అంటే.. మీరు ప్రతి నెలా చెల్లించే పెట్టుబడి మీద 8 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన 21 ఏళ్ల తర్వాత ఈ స్కీమ్ కింద తెరిచిన ఖాతాకు మెచ్యూరిటీ లభిస్తుంది.
అంటే మీరు పాప పుట్టగానే ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకొని నెలనెలా పెట్టుబడి పెడితే.. పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి ఖాతాకి మెచ్యూరిటీ వస్తుంది. 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే చాలు. ఆ తర్వాత 6 ఏళ్లు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 6 ఏళ్ల పాటు ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే.. 15 ఏళ్లకు అది రూ.22,50,000 అవుతుంది. దానికి వడ్డీ రూ.44,84,534 అవుతుంది. అంటే మొత్తం మెచ్యూరిటీ డబ్బు కలిపి రూ.67,34,534 అవుతుంది. అది పాపకు 21 ఏళ్లు దాటాక ఆమె అకౌంట్ లో జమ చేస్తారు. ఆ డబ్బుతో పాప పెళ్లి చేయొచ్చు.. లేదా ఉన్నత చదువులు చదివించవచ్చు.