Blood Donation : అర్జెంట్ గా బ్లడ్ కావాల్సి వస్తే ఏం చేస్తారు? ఎవరైనా తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి అడుగుతాం అంటారా? నిజానికి ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అర్జెంట్ గా బ్లడ్ కావాల్సి వస్తే వెంటనే కావాల్సిన రక్తం దొరకదు. రేర్ బ్లడ్ గ్రూప్ అయితే రక్తం కోసం చాలా చోట్ల తిరగాల్సి వస్తుంది. ఎంత తిరిగినా కూడా రక్తం దొరక్కపోతే.. రక్తం దొరకడం ఏ మాత్రం ఆలస్యం అయినా సరే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి.
అందుకే రక్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది రక్తం అవసరం కాగానే ఏదైనా బ్లడ్ బ్యాంకుకు ఫోన్ చేయడం, ఎవరైనా తెలిసిన వాళ్లను రక్తం డొనేట్ చేయాలని అడగడం చేస్తుంటారు. కానీ.. ఇక నుంచి మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ https://www.friends2support.org/ అనే ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇందులో మీ స్టేట్, సిటీ, ఏరియా వివరాలు ఎంట్రీ చేస్తే ఆ గ్రూప్ బ్లడ్ ఇచ్చే డోనర్స్ లిస్టు మొత్తం ఉంటుంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు. ఏ ఏరియాలో బ్లడ్ కావాలో ఆ ఏరియాను సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియాకే చెందిన వాళ్లు వచ్చి మీకు వెంటనే బ్లడ్ ఇస్తారు. అందులో వాళ్ల ఫోన్ నెంబర్ వివరాలు కూడా ఉంటాయి.
Blood Donation : బాంబే బ్లడ్ గ్రూప్ అయినా అందులో దొరుకుతుంది
అది బాంబే బ్లడ్ గ్రూప్ కావచ్చు.. మరేదైనా బ్లడ్ గ్రూప్ కావచ్చు.. అరుదుగా ఉండే ఏ నెగెటివ్, ఓ నెగెటివ్, ఏబీ నెగెటివ్, బీ నెగెటివ్ లాంటి బ్లడ్ గ్రూప్స్ అయినా సరే.. అన్ని బ్లడ్ గ్రూప్స్ కు సంబంధించి మీ ఏరియాలో ఉండే డోనర్స్ లిస్టు అందులో ఉంటుంది. మీరు జస్ట్ ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ స్టేట్, సిటీ, ఏరియా, బ్లడ్ గ్రూప్ వివరాలు కొడితే.. డోనర్స్ లిస్టు మొత్తం మీకు కనిపిస్తుంది. వెంటనే మీరు ఆ డోనర్ కు ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెబితే వాళ్లు వెంటనే వచ్చి మీకు కావాల్సిన బ్లడ్ ఇస్తారు.
ఒకవేళ మీరే డోనర్ గా మారి బ్లడ్ ఇవ్వాలనుకుంటే కూడా మీరు ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి బ్లడ్ డోనర్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ పేరు, సిటీ, ఏరియా, బ్లడ్ గ్రూప్, ఫోన్ నెంబర్ లాంటి వివరాలు ఇచ్చి డోనర్ గా రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎవరికైనా మీరు ఉండే ఏరియాలో రక్తం అవసరం అయితే వాళ్లు మీకు కాల్ చేస్తారు. వెంటనే వెళ్లి బ్లడ్ ఇచ్చి రావచ్చు.