FD Laddering : చాలామందికి ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ముఖ్యమైన విషయాలు తెలియదు. అదే వాళ్లు చేసే తప్పు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వాళ్లు ముందు ఎఫ్డీకి సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఎఫ్డీలో పెట్టుబడి పెట్టాలి. లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎక్కువ వడ్డీ పొందలేరు. తక్కువ వడ్డీతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ వడ్డీ రావాలంటే ఎఫ్డీలోనూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి ఎక్కువగా తెలియని వాళ్లు తమ దగ్గర ఎంత డబ్బు అంటే అంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తారు. ఓ 5 ఏళ్లకో లేక 10 ఏళ్లకో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. కానీ.. అలా చేస్తే చాలా వడ్డీని లాస్ అవ్వాల్సి వస్తుంది. దాని కోసం ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకోండి. ఉదాహరణకు మీ దగ్గర 3 లక్షల డబ్బు ఉందనుకోండి. ఆ డబ్బును ఒకే ఫిక్స్ డ్ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టకండి. చాలామంది తమ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బును ఎఫ్డీలో పెడతారు. కానీ.. అలా చేయకూడదు. ఫిక్స్ డ్ డిపాజిట్ లాడరింగ్ అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి.
FD Laddering : ఎఫ్డీ లాడరింగ్ అంటే ఏంటి?
ఎఫ్డీ లాడరింగ్ అంటే మీ దగ్గర ఉన్న 3 లక్షల్లో ఒక్కో లక్షను మూడు ఎఫ్డీలుగా పెట్టుకోండి. అందులో ఒక లక్షను ఒక సంవత్సరానికి, మరో లక్షను రెండేళ్లకు, ఇంకో లక్షను మూడేళ్లను ఎఫ్డీ చేయండి. మొదటిది ఒక లక్ష మెచ్యూరిటీ రాగానే దాన్ని, దాని మీద ఉన్న వడ్డీని మొత్తం 3 ఏళ్లకు ఎఫ్డీ చేయండి. అలాగే రెండోది కూడా అంతే. మూడోది కూడా అంతే. ఏది మెచ్యూరిటీ రాగానే ఆ డబ్బులను ఉపయోగించకుండా వెంట వెంటనే ఎఫ్డీలలో వేస్తూ ఉంటే మీకు చాలా లాభాలు వస్తాయి.
ఒకవేళ మీకు ఏ బ్యాంకులో అయినా సరే వడ్డీ తక్కువ వస్తుందని అనుకుంటే ఆ ఎఫ్డీ ని మార్చుకోవచ్చు. లేదా మీకు డబ్బులు అవసరం ఉంటే మధ్యలో ఎఫ్డీని బ్రేక్ చేయకుండా ఎఫ్డీని మెచ్యూరిటీ కాగానే వాడుకోవచ్చు. ఇలా ఎఫ్డీ లాడరింగ్ చేస్తే సాధారణ ఎఫ్డీ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అందుకే.. ఎఫ్డీ లాడరింగ్ చేసుకోండి. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా ఎఫ్డీ లాడరింగ్ పద్ధతి ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఎక్కువ వడ్డీ పొందొచ్చు.