PMSBY : టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును.. మీరు చదివింది నిజమే. డబ్బులు ఉన్నవాళ్లు అంటే వేలకు వేలు పెట్టి ఇన్సురెన్స్ స్కీములు తీసుకుంటారు. వాళ్లు స్కీమ్స్ తీసుకోకపోయినా కూడా వాళ్ల దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి అత్యవసర సమయాల్లో వాళ్ల దగ్గర ఉన్న డబ్బులను వాడుకుంటారు. మరి.. డబ్బులు లేని వాళ్ల సంగతి, పేదల పరిస్థితి ఏంటి. వాళ్లకు అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే ఏం చేయాలి. అనుకోని ప్రమాదం ఏర్పడితే ఏం చేయాలి.. అలాంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ పీఎంఎస్బీవై. దీన్నే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం అంటారు.
ఈ స్కీమ్ కింద సంవత్సరానికి రూ.20 కడితే చాలు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కింద అర్హులు అవుతారు. ఇది యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ పాలసీ. సంవత్సరానికి రూ.20 కడితే 2 లక్షల విలువైన యాక్సిడెంటల్ కవరేజ్ ను అందిస్తారు. ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి 60 రోజుల్లోపు 2 లక్షలు అందిస్తారు. ఒకవేళ శాశ్వతంగా నడవలేని పరిస్థితి ఉంటే, పని చేయలేని పరిస్థితి ఉన్నా రూ.2 లక్షలు ఇస్తారు. ప్రమాదంలో గాయాలయి ప్రాణాలతో బయటపడితే లక్ష రూపాయలు అందిస్తారు.
PMSBY : ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఎలా?
ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా అప్లికేషన్ అంటూ ఏం ఉండదు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఏవైనా సరే.. వాటిలో మీకు అకౌంట్ ఉంటే చాలు.. మీరు ఆ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.
దాని కోసం మీరు మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి ఒక ఫామ్ నింపితే చాలు. ప్రతి సంవత్సరం మీ అకౌంట్ లో నుంచి రూ.20 కట్ చేసుకుంటారు. మీరు ప్రత్యేకంగా డబ్బులు కట్ చేయాలని బ్యాంకుకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం ఆటోమెటిక్ గా బ్యాంక్ డబ్బులు కట్ చేసుకొని ఆ ఇన్సురెన్స్ కవరేజ్ ను అందిస్తుంది.
సంవత్సరానికి రూ.20 కట్టడం అనేది ఈరోజుల్లో అందరికీ సాధ్యమే. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన స్కీమ్ ను అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంచడంతో మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఆ బ్యాంకులో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు మూడు బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉంటే ఏదైనా ఒక్క బ్యాంకుల్లో మాత్రమే ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.