Heroines: సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఇందులో ఎంతో మంది నటీనటులు సినిమాలు అంటే ఆసక్తితో సినీ రంగంలోకి వస్తు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ గా రాణించాలని వచ్చిన వారిలో కొద్ది మంది మాత్రమే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంటారు.
నటిగా గుర్తింపు దక్కించుకోవాలంటే నెగటివ్ రోల్స్ లేదా లేడీ ఓరియంటెడ్ రోల్స్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో హీరోకు జోడీగా నటిస్తే హీరోయిన్ గొప్పతనం కనిపించదు. కాని ఏ హీరోయిన్ అయితే ఛాలెంజింగ్ పాత్రలు చేస్తారో వారు సూపర్ స్టార్స్ అవుతారు.
ఇండియన్ స్క్రిన్ పై ఛాలెంజింగ్ రోల్ అంటే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం లేదంటే వేశ్యగా కనిపించడం. ఈ రెండు రకాల పాత్రల్లో ఏ పాత్రలో అయితే జీవిస్తారో ఆ హీరోయిన్ మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్స్ లిస్టులో చేరడం ఖాయం. వేశ్యగా నటించి ఎప్పటికి గుర్తుండి పోయే పాత్రలను చేసిన కొందరు హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం.
అనుష్క: టాలీవుడ్ హీరోయిన్స్ లో వేశ్యగా నటించిన హీరోయిన్ అనగానే అనుష్క గుర్తుకు వస్తుంది. వేదం సినిమాలో అనుష్క వేశ్యగా కనిపించి మెప్పించింది.
శ్రియ సరన్: పవిత్ర సినిమాలో వేశ్యగా నటించి నటిగా తన స్థాయిని పెంచుకుంది. అందులో శ్రియ అందాల ఆరబోత.. తన నటన చాలా బాగుంటుంది.
రమ్యకృష్ణ: ఇక సూపర్ డీలక్స్ సినిమాలో కాస్త లేటు వయసు అయినా కూడా వేశ్యగా కనిపించింది. తమిళ సినిమా అయిన అది అక్కడ విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందింది.
శ్వేతా బసు ప్రసాద్: మధుర్ బండార్కర్ వెబ్ సిరీస్ లో శ్వేతబసు ప్రసాద్ వేశ్య పాత్రలో కనిపించింది.
ఈషా రెబ్బ: తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్ సిరీస్ కు గాను ఆ తరహా పాత్రలో నటిస్తోంది.
చార్మి: జ్యోతి లక్ష్మి మరియు ప్రేమ ఒక కావ్యం సినిమాల్లో హాట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ ఛార్మి కూడా వేశ్యగా కనిపించింది.
అర్చన: కమలతో నా ప్రయాణం సినిమాలో వేశ్యగా నటించి, మంచి గుర్తింపు పొందింది.
విద్యాబాలన్: బేగం జాన్ సినిమాలో వేశ్యగా నటించి తన అందాలతో ప్రేక్షకుల మనసును దోచేసింది.
రాణి ముఖర్జీ: లగా చునారీ మే డాగ్ అనే హిందీ సినిమాలో తన నటన.. తన అందాలతో వేశ్య పాత్రలో కనిపించి అలరించింది.
కరీనాకపూర్ ఖాన్: చమేలీలో సినిమాలో ఈ ముద్దుగుమ్మ వేశ్యగా నటించి కుర్ర కారును ఉర్రూతలూగించింది.
వేశ్య పాత్రల్లో నటించే హీరోయిన్ పట్ల గతంలో చులకన భావం ఉండేది. కాని ఇప్పుడు మాత్రం సినిమాను సినిమాలాగే చూస్తూ ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు.