Ayushman Bharat : మీకు ఆరోగ్యశ్రీ స్కీమ్ తెలుసు కదా. అది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ.. ఆరోగ్యశ్రీ స్కీమ్ ను మించిన స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని పూర్తి పేరు ప్రధానమంత్రి జజన్ ఆరోగ్య యోజన(పీఎంజేఏవై). బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ఇది. ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఉచితంగా హెల్త్ కార్డును అందిస్తారు. 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తారు.
ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఈ స్కీమ్ కు అర్హత ఉందో లేదో ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ స్కీమ్ అందరి కోసం ఉద్దేశించినది కాదు. https://pmjay.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ చెక్ చేసుకోవాలి. యామ్ ఐ ఎలిజిబుల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఫోన్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ ఇస్తే మీ అర్హతను చెక్ చేసుకోవచ్చు.
Ayushman Bharat : ఈ పథకం కింద అర్హత ఉంటే ఏ చేయాలి?
ఈ పథకం కింద అర్హత ఉంటే.. వెంటనే కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. దానిలో భాగంగా.. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. అక్కడ అన్ని వివరాలు అందజేయాల్సి ఉంటుంది. పలు ధృవీకరణ పత్రాలను అప్ లోడ్ చేయాలి. వివరాలు అన్నీ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత అధికారులు మీ అప్లికేషన్ ను వెరిఫై చేస్తారు. అంతా ఓకే అనుకుంటే.. ఆయుష్మాన్ భారత్ యోజన కార్డును జారీ చేస్తారు. అది ఇంటికే వస్తుంది. లేదంటే ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోకి వెళ్లి హెల్త్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ హెల్త్ కార్డు ద్వారా కేంద్రం ఎంప్యానెల్ చేసిన ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు. 5 లక్షల వరకు రూపాయి కట్టకుండా హెల్త్ కార్డు ఉపయోగించి చికిత్స పొందొచ్చు.