LIC Students Scholarship 2023 : ఎల్ఐసీ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి.. ఇన్సురెన్స్ స్కీమ్ కదా. అవును.. చాలామంది నమ్మేది ఎల్ఐసీనే. లైఫ్ ఇన్సురెన్స్ లో బెస్ట్ అని ఎల్ఐసీని అంటారు. అసలు ఎల్ఐసీ పాలసీ చేయించుకోని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎల్ఐసీ చేయించుకుంటారు. లైఫ్ ఇన్సురెన్స్ చేయించుకుంటారు. భవిష్యత్తులో తమకు ఏదైనా అయితే.. ఎల్ఐసీ భరోసా ఇస్తుందనే నమ్మకం. అందుకే కోట్లాది మంది భారతీయులు ఇప్పుడు ఎల్ఐసీని నమ్ముతున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు ఎల్ఐసీ స్టూడెంట్స్ కు ఎందుకు డబ్బులు ఇస్తుంది అనే కదా మీ డౌట్. ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్ షిప్ కింద ఎల్ఐసీ విద్యార్థులకు సాయం చేస్తోంది.
ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ లాంటి కోర్సులు చేస్తున్న విద్యార్థులకు వాళ్లకు 25 వేల వరకు స్కాలర్ షిప్ ను ఎల్ఐసీ అందిస్తుంది. సీఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఈ సర్వీసును అందిస్తున్నారు. ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు ఫ్రీగా స్కాలర్ షిప్ ను అందిస్తోంది.
LIC Students Scholarship 2023 : ఈ స్కాలర్ షిప్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ స్కాలర్ షిప్ కింద అర్హత సాధించాలంటే కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. టెన్త్ లో కనీసం 60 శాతం మార్కులు రావాలి. ఇంటర్ వాళ్లకు రెండు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం రూ.15 వేల స్కాలర్ షిప్ ను అందిస్తుంది. డిగ్రీ చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున మూడేళ్ల పాటు అందిస్తుంది. అలాగే.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్లకు రెండేళ్లకు సంవత్సరానికి రూ.20 వేల చొప్పున స్కాలర్ షిప్ ను అందిస్తారు.
టెన్త్ లో కనీసం 60 శాతం మార్కులతో పాటు కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం రూ.3.6 లక్షలు దాటకూడదు. ఒకవేళ 3.6 లక్షలు దాటితే ఈ స్కీమ్ కింద అర్హులు కారు. గూగుల్ లో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ అని కొడితే వెబ్ సైట్ వస్తుంది. అందులోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో వివరాలన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎల్ఐసీ వాళ్లు వివరాలను వెరిఫై చేస్తారు. ఒకవేళ విద్యార్థులు ఇచ్చిన వివరాలన్నీ ఓకే అనుకుంటే వాళ్లు ఎలిజిబుల్ అయితే వెంటనే వాళ్లకు స్కాలర్ షిప్ ను విడుదల చేస్తుంది. ఒకవేళ మీకు వెబ్ సైట్ ఏదో తెలియకపోతే https://www.buddy4study.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.