Mahila Samman Savings Certificate 2023 : మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఆ విషయం ఎంతమందికి తెలుసు. అది కేవలం మహిళల కోసం, వాళ్ల సాధికారత కోసం. కానీ.. ఇలాంటి పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చాలామందికి తెలియదు. ఆ పథకం పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2023. ఈ పథకం పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉంటుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయుతను ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకం ప్రకారం మహిళలు వాళ్లకు దగ్గర్లో ఉన్న ఏ పోస్ట్ ఆఫీసుకు అయినా వెళ్లి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసుల్లో ఎలాంటి అకౌంట్ లేకున్నా.. దగ్గర్లో ఉన్న ఏ పోస్ట్ ఆఫీసుకు అయినా వెళ్లి ఈ పథకం కింద మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
Mahila Samman Savings Certificate 2023 : ఎలా అప్లయి చేసుకోవాలి?
ఈ పథకం కోసం అప్లయి చేయడం చాలా సింపుల్. ఏదైనా పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఆధార్ కార్డు, ఫోటో ఇచ్చి ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత కనీసం రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు ఈ పథకం కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి డబ్బు మొత్తం చెల్లించాలి.
నెలనెలా ప్రీమియం కట్టే అవసరం ఉండదు. కనీసం వెయ్యి నుంచి చెల్లించవచ్చు. దీని పరిమితి రెండేళ్లు ఉంటుంది. రెండేళ్ల తర్వాత మీరు డిపాజిట్ చేసిన డబ్బుకు వడ్డీతో కలిపి మీ అకౌంట్ లో జమ చేస్తారు. దీనికి వడ్డీ 7.5 శాతం ఉంటుంది. అంటే.. రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే రెండేళ్ల తర్వాత ఆ 2 లక్షలకు అయిన వడ్డీ, అసలు రెండూ కలిపి బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేస్తారు.
ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఇది మహిళల కోసమే తీసుకొచ్చిన ప్రత్యేకమైన పథకం. ఒకవేళ మధ్యలోనే డబ్బులు అవసరం అయితే ఒక సంవత్సరం తర్వాత 40 శాతం వరకు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీ దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లి ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోండి.