Pan Card Lost : చాలామంది పాన్ కార్డు పోగొట్టుకుంటారు. అయ్యో పాన్ కార్డు పోయిందే అని టెన్షన్ పడుతుంటారు. పాన్ కార్డు పోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదదు. పాన్ కార్డు పోయినా కొత్తది తీసుకోవచ్చు. కాకపోతే కొత్త పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక వారం రోజుల సమయం పడుతుంది. మీ ఇంటికే కొత్త పాన్ కార్డును పంపిస్తారు. కాకపోతే 50 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అయితే.. పాన్ కార్డు పోతే మీకు ఆన్ లైన్ మీద అవగాహన ఉంటే కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం ఏ మీసేవకు, టీఎస్ ఆన్ లైన్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఆన్ లైన్ మీద అవగాహన ఉంటే మీ ఫోన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం ఇలా చేయండి.
Pan Card Lost : గూగుల్ లో రీప్రింట్ పాన్ కార్డు అని కొట్టండి
అలా చేయాలంటే ముందు మీరు మొబైల్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి రీప్రింట్ పాన్ కార్డు అని కొట్టండి. దీంతో మీకు ఒక వెబ్ సైట్ వస్తుంది. Onlineservices.nsdl.com అనే వెబ్ సైట్ ను ఓపెన్ చేసి రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇవ్వాలి.
ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రిక్వెస్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డు అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ ఉన్న వివరాలన్నీ సరిచూసుకొని మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ ఆనే బటన్ మీద క్లిక్ చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వాలిడేట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి. మోడ్ ఆఫ్ పేమెంట్ గా ఏదైనా ఆప్షన్ ద్వారా అంటే యూపీఐ లేదా ఇతర ఆప్షన్ల ద్వారా 50 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది.
అంతే.. డబ్బులు పే చేసిన తర్వాత మీరు ఇచ్చిన అడ్రస్ కు కొత్త పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. ఒకవేళ మీకు ఆన్ లైన్ లో ఎలా చేయాలో తెలియకపోతే మీసేవాకు వెళ్లి అక్కడ రూ.50 ఇచ్చి వివరాలు చెబితే ప్రింట్ తీసి ఇస్తారు.